ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: కేంద్రానికి సీఎం హెచ్చరిక.. గవర్నర్‌ను కట్టడి చేయండి.. లేకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుంది..

ABN, First Publish Date - 2023-07-04T08:44:51+05:30

రాష్ట్రప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నిస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కేంద్రప్రభుత్వం కట్టడి చేయకుంటే ప్రజల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- తమిళనాడుకు రవి బద్ధ శత్రువు

- ఆయనది అహంకారం, అధికార దుర్వినియోగం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నిస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కేంద్రప్రభుత్వం కట్టడి చేయకుంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) హెచ్చరించారు. ఆయన ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. తన నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేలా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడాన్ని సహించలేకే గవర్నర్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాము ప్రవేశపెడుతున్న పలు ప్రత్యేక పథకాల ద్వారా తమిళనాడు దేశంలోనే రెండో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదిగిందని, అయితే గవర్నర్‌ దీనిని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏ మంచి చేసినా ఆయనకు పట్టదని, అందువల్లే రవిని తమిళనాడుకు బద్ధ శత్రువని చెప్పాల్సి వస్తోందన్నారు. గవర్నర్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కూడా చెప్పవచ్చని, ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఇటీవల తాను జపాన్‌, సింగపూర్‌(Japan and Singapore)లలో పర్యటించి భారీస్థాయిలో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చున్నానని, చెన్నైలో నిర్వహించదలచిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల మహానాడుకు విదేశీ వ్యాపారవేత్తలను ఆహ్వానించానని గుర్తు చేస్తూ.. దీన్ని కూడా గవర్నర్‌ తప్పు బట్టారన్నారు. అలాంటి పర్యటన వల్ల పెట్టుబడులు రావంటూ ఆయన ఎద్దేవా చేసినా, తాము సంయమనంతో వ్యవహరించామన్నారు. బాధ్యత గల గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏం చెప్పదలచుకున్నారని ప్రశ్నించారు. ఆయన విదేశీ పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం అందజేసేపనిలోకి దిగారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదన్నదే ఆయన ఉద్దేశమన్నారు. విదేశీ పెట్టుబడులు వస్తే రాష్ట్రప్రజలకు ఉద్యోగాలు వస్తాయేమోనని ఆయన ఆలోచిస్తున్నారన్నారు. గవర్నర్‌ విమర్శలన్నీ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలు మెచ్చే పాలన సాగుతున్నందున గవర్నర్‌కు కడుపుమంటగా ఉందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చట్టానికి వ్యతిరేకంగా గవర్నర్‌ మాట్లాడుతున్నారన్నారు. న్యాయనిబంధనలకు లోబడే తాను వ్యవహరించాలన్న విషయం గవర్నర్‌కు తెలుసని, అయినా ఆయన రాజకీయ దురుద్దేశంతో తమిళనాడులో చక్రం తిప్పే ప్రయత్నాలు చేపట్టారన్నారు. గవర్నర్‌ ఇలా వ్యవహరించడానికి కారణం కేంద్రప్రభుత్వమా? లేక మరేదైనా అన్నది తనకు తెలియదన్నారు. ఆయన వెనుకుండి ఎవరు నడుపుతున్నారో తెలుసుకోదలచుకోలేదన్నారు.

గవర్నర్‌ కేవలం నామినేటెడ్‌ పదవి మాత్రమేనని, ఒకమంత్రిని తొలగించే, లేదా నియమించే అధికారం ఆయనకు లేదన్నారు. గవర్నర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ నేతగా రాణించడం సాధ్యం కాదన్నారు. మంత్రి సెంథిల్‌ బాలాజి వ్యవహారంలో బీజేపీ చెప్పినట్లు గవర్నర్‌ వ్యవహరిస్తున్నారనిమండిపడ్డారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఈడీ, ఆదాయపన్ను శాఖలు నిర్వహించిన తనిఖీల్లో అప్పటి మంత్రులను ఇప్పటివరకూ అరెస్టు చేయలేదన్నారు. అన్నాడీఎంకే అధికారం కోల్పోయిన తరువాత కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అయితే సెంథిల్‌ బాలాజి విషయంలో మాత్రమే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. మానవతా దృక్పథం లేకుండా అర్ధరాత్రి ఆయన్ని ఈడీ అధికారులు అరెస్టు చేశారన్నారు. తొమ్మిదేళ్ల క్రితం ఆయనపై నమోదైన అవినీతి కేసులో అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. విచారణ పేరుతో 18 గంటలు ఓ గదిలో బంధించి, చిత్ర హింసలు పెట్టారన్నారు. వైద్యులు ఆయనకు బైపాస్‌ సర్జరీ చేయాలని నిర్ణయించాక కూడా ఈడీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. సెంథిల్‌ బాలాజికి అందించిన చికిత్స బూటకమని కూడా పేర్కొన్నారని గుర్తు చేశారు. వైద్యుల సర్టిఫికెట్లను కూడా ఈడీ నమ్మడం లేదన్నారు. శాఖలేని మంత్రిగా ఉన్నందున సెంథిల్‌ బాలాజీని మంత్రివర్గం నుంచి గవర్నర్‌ తొలగించడం చట్టవిరుద్దమన్నారు. కాగా దేశంలో ఎంతోమంది మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతి కేసులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa)కు కోర్టు శిక్ష విధించాక కూడా ఆమె ఆ పదవిలో కొనసాగారని గుర్తుచేశారు. ఇప్పుడున్న కేంద్రమంత్రుల్లో పలువురిపై అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన నామినేషన్లను పరిశీలిస్తే అవగతమవుతుందన్నారు. దేశంలో తమను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలపై కేంద్రం దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ, సీబీఐ వంటి వాటిని అస్త్రాలుగా ప్రయోగిస్తోందన్నారు. ప్రస్తుత గవర్నర్‌ను తక్షణం రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేసిన సీఎం.. అసలు రాష్ట్రానికి గవర్నరే అవసరం లేదన్నది తమ అభిప్రాయమన్నారు.

జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాటులో డీఎంకే క్రియాశీలకంగా ఉంటుందని, ఆ కూటమిలో జాతీయస్థాయి పార్టీలు, పలురాష్ట్రాలముఖ్యమంత్రులు చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. ఇప్పటికే పలువురు నేతలు కూడా తనతో మాట్లాడారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌(BJP, Congress) లేని కూటమి కావాలని ఇప్పటికే పలువురు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని, అయితే అందుకు తాను వ్యతిరేకినని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ లేని ఏ కూటమి కూడా బీజేపీకి ఎదురొడ్డి నిలవలేదన్నారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా కాంగ్రెస్‌ - డీఎంకే(Congress - DMK) నేతృత్వంలోని కూటమిలో చీలికలు తీసుకురాలేదన్నారు. తమ రాజకీయ సిద్ధాంతాలను మార్చుకోబోమన్నారు. లౌకికవాద కూటమి తప్పకుండా ఏర్పాటవుతుందని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా తమ కూటమి విజయం సాధిస్తుందని స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-04T08:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising