Chief Minister: ఆ పనులన్నీ సకాలంలో పూర్తి చేయండి..
ABN, First Publish Date - 2023-09-22T08:41:20+05:30
దక్షిణ చెన్నై పరిధిలోని మడిపాక్కం నుంచి రామావరం వరకు చేపట్టిన రోడ్డు, వాన నీటి కాల్వల పనులను ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)
ప్యారీస్(చెన్నై): దక్షిణ చెన్నై పరిధిలోని మడిపాక్కం నుంచి రామావరం వరకు చేపట్టిన రోడ్డు, వాన నీటి కాల్వల పనులను ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) గురువారం ఉదయం స్వయంగా పరిశీలించారు. ఆ సమయంలో అక్కడ గుమిగూడిన ప్రజలను పలుకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుంతలుమెట్టలుగా వున్న రోడ్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా వర్షాకాలంలో వాహనాలతో వెళ్లాలంటే నరకం కనిపిస్తోందంటూ పలువురు వాపోయారు. ఈ సందర్భంగా సీఎం జోక్యం చేసుకుంటూ.. కొత్తగా రోడ్డు తవ్వకాల పనులను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. అంతేగాక ఇప్పటికే ప్రారంభించిన పనుల్ని వర్షా కాలానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం రామావరం, తిరువళ్లువర్ సాలై, మనపాక్కం, గెరుగంబాక్కం ప్రాంతాల్లో చేపట్టిన పనులను పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రులు ఎం.సుబ్రమణ్యం, కేఎన్ నెహ్రూ, టీఎం అన్బరసన్, మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహే్‌షకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జె.రాధాకృష్ణన్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-09-22T08:41:20+05:30 IST