ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: నిస్వార్థంగా ముందుకు సాగండి

ABN, First Publish Date - 2023-09-28T07:50:25+05:30

ఉద్యోగులే ప్రభుత్వానికి - ప్రజలకు మధ్య వారధిలా పనిచేసి మంచి పేరు తీసుకువస్తారని, ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా

- గ్రూప్‌-4 ఉద్యోగులకు స్టాలిన్‌ పిలుపు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులే ప్రభుత్వానికి - ప్రజలకు మధ్య వారధిలా పనిచేసి మంచి పేరు తీసుకువస్తారని, ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా ఎంపికైన యువతీ యువకులు నిస్వార్థ సేవలతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఎన్‌పీఎస్సీ ఆధ్వర్యంలో జూనియర్‌ అసిస్టెంట్‌, వీఏఓ, టైపిస్టు, స్టెనోగ్రాఫర్‌ తదితర గ్రూప్‌-4 పోస్టులకు 10,205 మంది ఎంపికయ్యారు. చేపాక్‌ కలైవానర్‌ అరంగంలో బుధవారం ఉదయం ఏర్పాటైన సభలో ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆయన ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ... ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా, సమర్థవంతంగా పనిచేయాలంటే వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సేవాభావంతో విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోటీ పరీక్షల ఫలితాలు వెలువరించడంలో నెలకొన్న జాప్యాన్ని నివారించేందుకుగా రూ. 95లక్షలతో ఆన్‌ స్ర్కీన్‌ ఎవాల్యువేషన్‌ ల్యాబ్‌ అనే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని టీఎన్‌పీఎస్సీలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇదే రీతిలో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాలు వీలైనంత త్వరగా వెలువరించడానికి ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాతృభాషకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని, కనుకనే టీఎన్‌పీఎస్సీ పరీక్షల్లో తమిళ మాధ్యమంలో చదివినవారికి 20 శాతం రిజర్వేషన్‌ కల్పించినట్లు స్టాలిన్‌ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రత్యేక చట్టం తీసుకువచ్చి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వోద్యోగాల్లో తమిళులకు ప్రాధాన్యం...

కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని తపాలాశాఖ, రైల్వేశాఖ, బ్యాంకుల్లో ఉద్యోగాలను భర్తీ చేసేటప్పుడు స్థానికులైన తమిళ యువకులకు ప్రాధాన్యం కల్పించాలని తాను ప్రధాని మోదీకి లేఖ రాశానని, అదే విధంగా ఈ మూడు శాఖలకు సంబంధించి నిర్వహించే పోటీపరీక్షలను తమిళ మాధ్యమంలోనూ జరపాలని కోరినట్టు స్టాలిన్‌ చెనపప్పారు. తన కలల ప్రాజెక్ట్‌ నాన్‌ ముదల్వన్‌ పథకం ద్వారా గతేడాది 13 లక్షల మంది యువకులు శిక్షణ పొందటం ఆనందాన్ని కలిగించిందని, ఆ పథకం ఆశించిన లక్ష్యానికి మించి సేవలందిస్తోందన్నారు. ప్రైవేటు సంస్థల్లో లక్షలాది రూపాయలను ఫీజుగా చెల్లించి నేర్చుకోవాల్సిన శిక్షణలను నాన్‌ముదల్వన్‌ పథకం ఉచితంగా అందిస్తోందన్నారు. కేంద్రప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లోనూ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు తదితర పరీక్షల్లోనూ రాష్ట్రానికి చెందిన యువకులు విజయం సాధించాలన్న తపనతో ఐదువేలమందికి శిక్షణలందించామని, వారిలో 90 శాతం మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. గ్రూప్‌-3 పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగం పొందామని సంతృప్తి చెందకుండా సర్వీసులో ఉంటూ యూపీఎస్సీ వంటి ఉన్నతమైన పరీక్షలలోనూ ఉత్తీర్ణులై ప్రజలకు సేవలందించాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న తమ ప్రభుత్వానికి అండగా నిలిచి సామాన్య పౌరులు కూడా సంతసించే విధంగా సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెరియసామి, రామచంద్రన్‌, తంగం తెన్నరసు, ఎంపీ సామినాథన్‌, ఎ.చక్రపాణి, ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా, మానవ వనరుల శాఖ కార్యదర్శి నందకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-28T07:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising