ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: నందిని ఉన్నత విద్య బాధ్యత ప్రభుత్వానిదే..

ABN, First Publish Date - 2023-05-10T08:56:33+05:30

ప్లస్‌-2 పబ్లిక్‌ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమశ్రేణిలో నిలవడంతో పాటు 600కి 600 మార్కులు సాధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్లస్‌-2 పబ్లిక్‌ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమశ్రేణిలో నిలవడంతో పాటు 600కి 600 మార్కులు సాధించిన దిండుగల్‌ విద్యార్థిని నందిని(Nandini) ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. దిండుగల్‌ అన్నామలైయార్‌ మిల్స్‌ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని నందిని ఆరు పాఠ్యాంశాలలో నూటికి నూరు మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ శ్రేణిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆ విద్యార్థినిని, ఆమె కుటుంబీకులకు అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా చెన్నైలో తనను కలుసుకోవాల్సిందిగా సమాచారం పంపారు. ఆ మేరకు చెన్నై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం నందిని, ఆమె కుటుంబీకులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నందినికి చాక్లెట్ల బాక్స్‌ను స్టాలిన్‌ కానుకగా అందజేశారు. నందినితోపాటు ఆమె తల్లిదండ్రులు, దిండుగల్‌ పాఠశాల హెడ్మాస్టర్‌ ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష, ఆ శాఖ డిప్యూటి కమిషనర్‌ కె.నందకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ... నందిని ఉన్నత విద్యా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, ఆమెకు నచ్చిన కోర్సులో నచ్చిన కళాశాలలో చేరవచ్చనని తెలిపారు.

నందినికి స్వర్ణ కలం

- రచయిత వైరముత్తు

ప్యారీస్‌(చెన్నై): ప్లస్‌టూ పబ్లిక్‌ పరీక్షల్లో వందశాతం మార్కులు సాధించిన నందినికి స్వర్ణ కలం బహూకరిస్తానని ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్లస్‌టూ పరీక్షల్లో నందిని 600కి 600 మార్కులు సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమెను సీఎంతో పాటు పలువురు ప్రముఖులు అభినందించగా, తాజాగా వైరముత్తు కూడా ఆ జాబితాలో చేరారు. తనకు బహుమతిగా వచ్చిన స్వర్ణ కలాన్ని నేరుగా దిండుగల్‌ వెళ్లి నందినికి అందిస్తానని వైరముత్తు ప్రకటించారు.

Updated Date - 2023-05-10T08:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising