ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: ముఖ్యమంత్రి ఎంతమాట అనేశారేంటో.. ఏమన్నారో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-04-22T09:01:47+05:30

ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అందరిచూపు రాష్ట్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): గత రెండేళ్ళ డీఎంకే పాలన దేశం మొత్తాన్ని రాష్ట్రం వైపు తిరిగేలా చేసిందని సీఎం ఎంకే స్టాలిన్‌(CM MK Stalin) పేర్కొన్నారు. ఈ రెండేళ్ళ స్వల్పకాలంలోనే రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులను ఆకర్షించినట్టు ఆయన తెలిపారు. అలాగే, రాష్ట్ర వృద్ధిరేటు 6.11 శాతంగా నమోదైందని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పోలీస్‌, అగ్నిమాపక, జాతీయ విపత్తుల సహాయక చర్యలపై జరిగిన పద్దులపై ఆయన సుధీర్ఘ ప్రసంగం చేశారు. గత రెండేళ్ళ క్రితం ఇదే ఏప్రిల్‌ నెలలో రాష్ట్ర ప్రజలు డీఎంకే(DMK)కు అధికారం ఇచ్చారన్నారు. మరో రెండు వారాల్లో డీఎంకే ప్రభుత్వం రెండేళ్ళ కాలాన్ని పూర్తి చేసుకుని మూడో యేడాదిలోకి అడుగుపెడుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తమ ప్రభుత్వ ఏదో ఒక రూపంలో మంచి చేస్తుందనే విషయాన్ని సగర్వంగా ఈ సభలో చెప్పగలనని తెలిపారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పటివరకు 265 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారన్నారు. కుటుంబ యజమానురాలికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని సెప్టెంబరు నుంచి అమలు చేస్తామన్నారు. ఈ పథకం కింద కోటి మంది మహిళలు నెలనెలా లబ్ధి పొందుతారని చెప్పారు. డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో రాష్ట్ర రెవెన్యూ(State Revenue) లోటు రూ.62 వేల కోట్లుగా ఉండగా, ఇపుడు ఇది రూ.30 వేల కోట్లకు తగ్గించామన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు చెప్పారు. స్వరాష్ట్ర వృద్ధిరేటు 6.11 శాతంగా ఉందన్నారు. వ్యవసాయ వృద్ధి రేటుతో పాటు సాగుబడి విస్తీర్ణం కూడా పెరిగిందన్నారు. ఇలా ప్రతి ఒక్క శాఖ ప్రగతిని తాను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు ఉచిత కరెంట్‌ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఫలితంగా ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తున్నామని తెలిపారు. ఉదయాన్నే పాఠశాలకు వెళ్ళే చిన్నారుల ముఖాల్లో వెలుగులు చూస్తున్నామన్నారు. దీనికి కారణం ప్రతి రోజూ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని అమలు చేయడమేనన్నారు. ఇలా ఏదో ఒక రూపంలో ప్రజలకు మేలు చేస్తున్నామని,దీన్ని ఏఒక్కరూ విస్మరింపజాలరన్నారు.

పోలీసుల వ్యవహారశైలిలో లోపాలు ఉండొచ్చు..

రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిలో లోపాలు ఉండొచ్చన్నారు. లోపాలు లేవని తాను చెప్పడం లేదన్నారు. లోపాలు వెలికి తీస్తే వాటిని సరిదిద్దామేగానీ, ఎక్కడా వదిలి వేయలేదన్నారు. నేరాలకు పాల్పడేవారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిన్న చిన్న తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకునే దిశాగా పోలీసులు ఉండాలని సూచించారు. రాష్ట్రంలో కుల ఘర్షణలు లేవన్నారు. మత కలహాలు లేవన్నారు. అల్లర్లు, ముఠా తగాదాలు, తుపాకీ కాల్పులు, లాకప్‌ డెత్‌లు లేవన్నారు. ‘లేవనే’ విషయాలనే అనేకం చెప్పుకోవచ్చన్నారు. ఇలాంటి సంఘటనలు లేవని రుజువుచేసేలా కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయన్నారు. పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. అన్ని శాఖలు ప్రగతిని సాధించాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. ‘ప్రశాంతమైన రాష్ట్రం తమిళనాడు’ అనే పేరును గడించినట్టు చెప్పారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే అది శాంతిమతమైన రాష్ట్రంగా పేర్కొన్నారు.

శాంతిభద్రతలు భేష్‌...

రాష్ట్రంలోని శాంతిభద్రలు భేషుగ్గా ఉన్నాయన్నారు. ఫలితంగా ప్రజల్లో ఎలాంటి భయాలు లేకుండా నిర్భయంగా జీవిస్తున్నారని చెప్పారు.ఎలాంటి జోక్యాలు లేకుండా పోలీస్‌ శాఖ పని చేయాలని ఆదేశించచామన్నారు. సంఘ విద్రోశక్తులు, దోపిడీదారులను హుటాహుటిన అరెస్టులు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉత్తర భారతీయులపై దాడులు జరిగినట్టుగా తప్పుడు వీడియోలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఈ కేసులో 178 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ అంశంలో రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం సత్వరం స్పందించి చర్యలు తీసుకోవడం వల్లే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఉద్రిక్తతలను నివారించగలిగినట్టు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని చెబుతూ ఈ సందర్భంగా ఆయన గణాంకాలను వెల్లడించారు.

ఫైనాన్స్‌ కంపెనీలపై నిఘా

అధిక వడ్డీలు, రెట్టింపు వడ్డీలు ఇస్తామంటూ ప్రజలకు ఆశ చూపి వారితో లక్షలాది రూపాయలు డిపాజిట్లు చేయించుకుని మోసం చేసే ఫైనాన్స్‌ కంపెనీలపై ప్రత్యేక దృష్టిసారించి నిఘా వేస్తామన్నారు. ఇలాంటి ఫైనాన్స్‌ కంపెనీలను ఓ కంట కనిపెట్టాలని ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగాలను ఆదేశిస్తున్నట్టు చెప్పారు. ఆరుద్ర వంటి గోల్డ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు మోసాలకు పాల్పడకుండా ఆరంభంలోనే ఒక చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ముత్తమిళరింజ్ఞర్‌ కలైంజ్ఞ్ఞర్‌ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వానికే చెందుతుందన్నారు. అలాగే, ఇలాంటి ఫైనాన్స్‌ కంపెనీల్లో ప్రజలు పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని సీఎం స్టాలిన్‌ సూచించారు.

పోలీస్‌ శాఖకు 101 వరాలు...

చెన్నైలో రెండు వేల సీసీ కెమెరాలను అందిస్తామని పేర్కొనడంతోపాటూ రాష్ట్ర పోలీస్‌ శాఖకు 101 వరాలను సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ ఒక ప్రకటన చేశారు. మిడిల్‌ క్లాస్‌ పోలీస్‌ స్టేషన్లకు కంప్యూటర్లు అందిస్తామన్నారు. చెన్నై నగర పోలీసులకు బాంబులను గుర్తించే పరికరాలను అందజేస్తామని తెలిపారు. పోలీస్‌ పెట్రోలింగ్‌ కోసం అత్యాధునిక సదుపాయాలతో కూడిన వాహనాలు సమకూర్చుతామన్నారు. పోలీసు శునకాలకు అందించే ఆహార అలవెన్సును రూ.200 నుంచి రూ.300కు పెంచుతున్నట్టు చెప్పారు. పోలీస్‌ వైద్య సౌకర్యాన్ని హోంగార్డులకు కూడా అందిస్తామన్నారు. ఇలా 101 వరాలను సీఎం స్టాలిన్‌ పోలీస్‌, అగ్నిమాపకశాఖలకు ప్రకటించారు.

Updated Date - 2023-04-22T09:01:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising