ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: ప్రణాళికా సంఘం సేవలు భేష్‌

ABN, First Publish Date - 2023-09-23T12:50:35+05:30

గత రెండున్నర సంవత్సరాలకు పైగా ఇటు డీఎంకే ప్రభుత్వానికి, అటు రాష్ట్ర ప్రజలకు మధ్య వారధిలా ప్రణాళికా సంఘం నిలిచిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)

చెన్నై, (ఆంధ్రజ్యోతి): గత రెండున్నర సంవత్సరాలకు పైగా ఇటు డీఎంకే ప్రభుత్వానికి, అటు రాష్ట్ర ప్రజలకు మధ్య వారధిలా ప్రణాళికా సంఘం నిలిచిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) కొనియాడారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యవ ఇచ్చి అనువైన సమయాల్లో తగిన సలహాలతో తమకు మార్గనిర్దేశం చేస్తోందని ప్రశంసించారు. సచివాలయంలో శుక్రవారం ఉదయం ప్రణాళికా సంఘం నాలుగో సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడైన ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థికమంత్రి తంగం తెన్నరసు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జె.జయరంజన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా, సంఘం సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి కోసం రూపొందించిన భవిష్యత్తు కార్యాచరణ పథకాలపై సమీక్షించారు. సిటీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం, ఇళ్ల వద్దకే విద్య, ప్రజల వద్దకే వైద్యం, గృహిణులకు కలైంజర్‌ మహిళా సాధికారిక పథకం తదితర పథకాలను పటిష్ఠంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ పథకాల అమలులో లోపాలు తలెత్తితే తక్షణమే సవరించేందుకు జిల్లా కలెక్టర్లను పురమాయించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జయరంజన్‌ను ఆదేశించారు.

ప్రస్తుతం ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీ, పరిశ్రమలు-4.0, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ), పత్తినూలు, చేనేత, పర్యాటక, వైద్య హక్కుల, వ్యర్థాల తొలగింపు నిర్వహణ, నీటి వనరుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, గృహ వసతులను మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిటీ, టౌన్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో మహిళలు ప్రతినెలా రూ.800 నుంచి రూ.1200 వరకు పొదుపు చేయగలుగుతున్నారని, నాన్‌ ముదల్వన్‌ పథకం ద్వారా పది లక్షల మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికే 13 లక్షల మంది లబ్ధి పొందారని చెప్పారు. ఇక తాజాగా గృహిణులకు ప్రతినెలా రూ.1000 చెల్లించే కలైంజర్‌ మహిళా సాధికారిక పథకం అమలుతో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక లావాదేవీలు అధికమయ్యాయని, గృహిణుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని అన్నారు. ఈ సమావేశానికి ఇంకా ముఖ్యమంత్రి ప్రత్యేక సహాయకులు ఎన్‌. మురుగానందం, పథకాలు అభివృద్ధిశాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కే.గోపాల్‌, ఆర్థిక శాఖ (ఖర్చులు) కార్యదర్శి ఎస్‌.నాగరాజన్‌, ప్రణాళికా సంఘం సభ్యులు ఇరామ్‌ శ్రీనివాసన్‌, ఎం.విజయభాస్కర్‌, డాక్టర్‌ ఎన్‌.ఎళిలన్‌, కె.దీనబంధు, సుల్తాన్‌ అహ్మద్‌ ఇస్మాయిల్‌, డాక్టర్‌ జె.అమలోమర్బవనాథన్‌, డాక్టర్‌ కె.శివరామన్‌, నర్తకి నటరాజ్‌, మెంబర్‌ సెక్రటరీ ఎస్‌.సుధారమన్‌ తదితరులు కూడా హాజరయ్యారు.

Updated Date - 2023-09-23T12:50:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising