Chief Minister: గృహిణులకు ప్రతినెలా రూ.1000 పథకం..
ABN, First Publish Date - 2023-07-08T08:29:32+05:30
గృహిణులకు ప్రతినెలా రూ.1000 చెల్లించే పథకాన్ని అమలు చేయడానికి ప్రత్యేక శిబిరాల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి ఎంకే
చెన్నై, (ఆంధ్రజ్యోతి): గృహిణులకు ప్రతినెలా రూ.1000 చెల్లించే పథకాన్ని అమలు చేయడానికి ప్రత్యేక శిబిరాల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) అధ్యక్షతన జరిగిన అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ప్రతి రేషాన్‌షాపు వద్ద నిర్ణీత తేదీల్లో ప్రత్యేక శిబిరాలు జరిపి కార్డుదారుల్లో సభ్యులుగా ఉన్న గృహిణులను రప్పించి వారి ఆధార్, బ్యాంక్ ఖాతాలు(Aadhaar, bank accounts) తదితర వివరాలను పొందిన తర్వాతే ఎంపిక చేస్తారు. 21 యేళ్లు పైబడిన గృహిణులే ఈ పథకానికి అర్హులుగా ప్రకటించాలని కూడా ఈ సమావేశంలో సీఎం సూచించారు. ఈ పథకాన్ని సెప్టెంబర్ 15 నుంచి అమలు చేయనుండడంతో ఆగస్టుకల్లా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇక రేషన్‌కార్డులో చూపిన చిరునామాలలోనే గృహిణులు నివశిస్తుండాలని, వారి వార్షికాదాయం కూడా నిర్దేశిత పరిమాణంలో ఉండాలని, ఈ నిబంధనలన్నీ అధికారులు తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రస్తుతం బియ్యంకార్డుదారులుగా ఉన్న గృహిణులలో యాభైశాతం మందిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశం ఉందంటూ ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా ప్రజాకర్షణీయ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన దాఖలులు లేవని విమర్శిస్తున్నారు.
Updated Date - 2023-07-08T08:29:34+05:30 IST