ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఆ రాష్ట్రం సహా 40 చోట్ల గెలుపు మాదే..

ABN, First Publish Date - 2023-06-11T08:47:39+05:30

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, పుదుచ్చేరి సహా నలభై లోక్‌సభ స్థానాలు మనవే అనే ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సేలం సభలో స్టాలిన్‌ ధీమా

ప్యారీస్‌(చెన్నై): రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, పుదుచ్చేరి సహా నలభై లోక్‌సభ స్థానాలు మనవే అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం సేలంలోని ఓ కల్యాణమండపంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ... కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్యంలో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన పథకాలలో డీఎంకే భాగస్వామ్యం ఉందన్నారు. అయితే ఈ తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి అందించిన పథకాల జాబితాను ఆదివారం వేలూరులో జరుగనున్న బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించగలరా? అని సవాలు విసిరారు. దేశవ్యాప్తంగా బీజేపీ(BJP) ప్రాభవం సన్నగిల్లుతోందని, ఇందుకు నిదర్శనం ఇటీవల కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly) ఎన్నికల ఫలితాలేనని అన్నారు. సేలం నగరం డీఎంకే కంచుకోట లాంటిదని, దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై న్యూజస్టిస్‌ పార్టీని ద్రావిడ కళగంగా మార్చింది సేలం గడ్డపైనేనని గుర్తు చేశారు. 1996లో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన కరుణానిధి మూడు రోజులపాటు మహానాడు నిర్వహించి జాతీయ స్థాయి పార్టీకి గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలకు సమాన రాయితీలు కల్పించిన కరుణ శత జయంతి వేడుకలను ఈ సంవత్సరమంతా జరుపుకోవాలని పార్టీ అధిష్ఠాం నిర్ణయించిందన్నారు. ఇక జిల్లా పార్టీ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, సర్పంచులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు. 2024లో లోక్‌సభకు జరగనున్న ఎన్నికల ప్రచార తొలి వేదిక సేలం కావడం ఎంతో సంతృప్తిని కలిగించిందన్నారు. బూత్‌స్థాయి కమిటీల ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం ఉందన్న భ్రమతో ఉండకుండా ఇప్పటి నుంచే అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, ఎమ్మెల్యేలు టీ.ఎం.సెల్వగణపతి, రాజేంద్రన్‌, ఎస్‌.ఆర్‌.శివలింగం, ఎంపీ ఎస్‌.ఆర్‌. పార్తిబన్‌, సేలం మేయర్‌ రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు కరుణ విగ్రహం ఆవిష్కరణ...

మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం సేలం నగరానికి చేరుకున్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు విమానాశ్రయం వద్ద పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పార్టీ సమావేశం అనంతరం ఆయన సేలం అస్తంబట్టి మాళిగైలో రాత్రి బస చేశారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు సేలం అన్నాపార్కు కూడలి వద్ద ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. స్మార్ట్‌ సిటీ పథకం కింద సేలంలో నిర్మించిన రెండంతస్తుల బస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కరుప్పూరు ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగే ప్రత్యేక సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రూ.33.60 కోట్లతో నిర్మించిన నెహ్రూ ఆర్ట్స్‌ హాలును ప్రారంభించనున్నారు.

Updated Date - 2023-06-11T08:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising