ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.. అవును.. మాది కుటుంబ పాలనే..

ABN, First Publish Date - 2023-06-30T08:02:17+05:30

రాష్ట్రంలో డీఎంకే కుటుంబ రాజకీయాలను నడుపుతోందంటూ ప్రధాన నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రకటించ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పార్టీ సభ్యులంతా మా కుటుంబమే

- మోదీ వ్యాఖ్యలపై స్టాలిన్‌ ధ్వజం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డీఎంకే కుటుంబ రాజకీయాలను నడుపుతోందంటూ ప్రధాన నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రకటించడం విడ్డూరంగా వింతగా ఉందని, మోదీ చెప్పింది అక్షరాలా నిజమేనని, డీఎంకేలోని సభ్యులంతా కుటుంబ సభ్యులుగానే మెలగుతూ రాజకీయాలు చేస్తున్నట్టు అంగీకరిస్తున్నానని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) స్పష్టం చేశారు. స్థానిక తేనాంపేట అన్నా అరివాలయంలోని కలైంజర్‌ అరంగంలో డీఎంకే(DMK) ఉన్నత కార్యాచరణ మండలి సభ్యుడు గుమ్మిడిపూండి కే వేణు మనవరాలు అశ్విని వివాహం గురువారం ఉదయం జరిగింది. ఈ వివాహవేడుకకు హాజరైన ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ డీఎంకే సభ్యులంతా కుటుంబ సభ్యుల్లాగే సఖ్యతగా మెలగుతారని, డీఎంకే వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై పార్టీ ప్రముఖులు, కార్యకర్తలను ‘తమ్ముడూ’ అని పిలిచేవారని, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సైతం ‘తోబుట్టువులారా’ అని అని సంబోధించటమే ఆనవాయితీగా పెట్టుకున్నారని, దానిని బట్టి పార్టీ శ్రేణులందరినీ కుటుంబ సభ్యులుగానే భావించాలన్న విషయం అవగతమవుతుందన్నారు. డీఎంకే కుటుంబ రాజకీయాలు జరుపుతోందన్న మోదీ, డీఎంకే కుటుంబాలే యేళ్లతరబడి అభివృద్ధి చెందుతున్నాయని కూడా విమర్శించారని, వాస్తవానికి డీఎంకే శ్రేణులంతా పార్టీ ఆధ్వర్యంలో జరిగే మహానాడు తదితర సభలు, ప్రజాందోళనల్లో పార్టీ ప్రముఖులు, నేతలు కుటుంబ సమేతంగా పాల్గొనటం ఆనవాయితీ అని స్టాలిన్‌ గుర్తు చేశారు. డీఎంకేకి ఓటేస్లే కరుణానిధి కుటుంబమే అభివృద్ధి చెందుతుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, కరుణానిధి కుటుంబం అంటే రాష్ట్ర ప్రజలేనని స్టాలిన్‌ అన్నారు.

ఐదు దశాబ్దాలుగా ద్రావిడ పార్టీలే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని ఇప్పటిదాకా బీజేపీ వంటి ప్రత్యర్థులు గుర్తించకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. గుమ్మిడిపూండి మాజీ ఎమ్మెల్యే వేణు పార్టీకి సేవలందించేందుకే తన జీవితాన్ని అంకితం చేశారని, దేశంలో ఎమర్జన్సీ రోజుల్లో తనతోపాటు ఆయన కూడా అరెస్టయి జైలులో ఉన్నారని,, అప్పట్లో తమ తొలి పెళ్ళి రోజు వేడుకలను జైలులో జరుపుకున్నామని ఆయన వివరించారు. ఇటీవల బిహార్‌(Bihar)లో ప్రతిపక్ష నేతలంతా కలుసుకుని లోక్‌సభ ఎన్నికలపై వ్యూహరచన చేయడంపై ప్రధాని మోదీ భయపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో పత్తా లేకుండా పోతామని ఆందోళన చెందుతున్నారని స్టాలిన్‌ విమర్శించారు. బీజేపీ అధికారంలోఉన్న మణిపూర్‌లో యాభైరోజులుగా అల్లర్లు, హింసాకాండ జరుగుతున్నా ప్రధాని మోదీ ఏ మాత్రం పట్టించుకోలేదని, ఇప్పటివరకూ ఆరాష్ట్రం వైపు మోదీ కన్నెత్తికూడా చూడలేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తు తం ఉమ్మడి పౌరసత్వ చట్టం అమలు చేయనున్నట్లు మోదీ ప్రకటించడం దేశంలో మతం, కులంపేరుతో ఘర్షణలు జరిగేందుకే ఆయన ఆరోపించారు. ఈ వివాహ వేడుకల్లో మంత్రులు దురైమురుగన్‌, ఆర్‌గాంధీ, ఎంపీలు టీఆర్‌ బాలు, ఎ. రాజా, ఎస్‌ జగ్రదక్షగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-30T08:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising