Chief Minister: పటిష్ఠంగా రూ.1000 పథకాన్ని అమలు చేయండి
ABN, First Publish Date - 2023-08-13T07:29:31+05:30
కలైంజర్ మహిళా సాధికారిక నగదు పంపిణీ పథకాన్ని రాష్ట్రమంతటా పటిష్ఠంగా అమలు చేయడానికి తగు చర్యలు చేపట్టాలని అధికారులను
- అధికారులకు సీఎం ఆదేశం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): కలైంజర్ మహిళా సాధికారిక నగదు పంపిణీ పథకాన్ని రాష్ట్రమంతటా పటిష్ఠంగా అమలు చేయడానికి తగు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆదేశించారు. సచివాలయంలో శనివారం ఉదయం ఆ పథకం అమలుకు సంబంధించి అధికారులు, మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై(Former Chief Minister Annadurai) జయంతి సెప్టెంబర్ 16న ఈ పథకాన్ని కాంచీపురం(Kanchipuram)లో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ పథకం అమలుకు రూ.7వేల కోట్ల మేర విడుదల చేశారు. ఈ పథకం కింద ఇప్పటివరకూ 1.48 కోట్ల మంది గృహిణులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 15 తర్వాత కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో గృహిణులకు ప్రతినెలా వారి ఖాతాల్లో రూ.1000లు సక్రమంగా జమ అయ్యే విధంగా ఈ పథకాన్ని ఎక్కడా ఎలాంటి తప్పిదాలకు తావులేని విధంగా పటిష్టంగా అమలు చేయాలని స్టాలిన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. సమావేశంలో మంత్రులు దురైమురుగన్, పెరియసామి, ఉదయనిధి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా పాల్గొన్నారు.
Updated Date - 2023-08-13T07:29:31+05:30 IST