ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2023-10-04T09:32:40+05:30

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దుష్టశక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను

- కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం స్టాలిన్‌ ఆదేశం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దుష్టశక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎం స్టాలిన్‌(CM Stalin) ఆదేశించారు. సచివాలయం సమీపంలోని నామక్కల్‌ కవింజర్‌ మాళిగై సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం ప్రారంభమైన రెండు రోజుల జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో శాంతిభద్రతలను పరిరక్షించడం, విఘాతం కలిగించేవారిపై అప్పటికప్పుడు కఠిన చర్యలు చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలన్నారు. కుల, మతాల ప్రాతిపదికన రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘా తం కలిగించేందుకు కొన్ని మతతత్వ శక్తులు కుట్రపన్నుతున్నాయని, వాటిని అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తాను తరచూ రెండు మూడు జిల్లాల్లో పర్యటిస్తూ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతున్నానని, ఆ సమావేశాలు సత్ఫలితాలిచ్చాయని చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీలపై కులపరంగా జరిగే వేధింపులను నిరోధించేందుకు జిల్లా కలెక్టర్లు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

కడలికోతను నిరోధించాలి...

సముద్రతీర జిల్లాల్లో కోతను నిరోధించేందుకు జిల్లా కలెక్టర్లతో సంప్రదించి చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రం ప్లాస్టిక్‌ నిషేధం అమలులో భాగంగా పసుపు సంచుల వినియోగాన్ని అధికం చేయడానికి అటవీ శాఖాధికారులు, కలెక్టర్లు అవగాహన ప్రచార కార్యక్రమాలు జరపాలన్నారు. అటవీ జంతువులను కాపాడేందుకు, అడవులను సంరక్షించడమే కాకుండా అటవీ సంపద అక్రమరవాణా నిరోధానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దురైమురుగన్‌, దామో అన్బరసన్‌, కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, పొన్ముడి, ముత్తుసామి, అనితా రాధాకృష్ణన్‌, పీకే శేఖర్‌బాబు, గీతా జీవన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా, డీజీపీ శంకర్‌జివాల్‌, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ సంధీప్‌రాయ్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-04T09:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising