ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: నేడు పట్నా వెళ్లనున్న ముఖ్యమంత్రి

ABN, First Publish Date - 2023-06-22T07:28:33+05:30

డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) గురువారం పట్నా పర్యటనకు బయలుదేరివెళ్లనున్నారు. అక్కడ జరిగే విప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రేపు విపక్షాల భేటీకి హాజరు

అడయార్‌(చెన్నై): డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) గురువారం పట్నా పర్యటనకు బయలుదేరివెళ్లనున్నారు. అక్కడ జరిగే విపక్షాల భేటీలో ఆయన పాల్గొంటారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని భారీతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా కలిసి పయనించేలా బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌(Bihar Chief Minister Nitish Kumar) ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్నా వేదికగా జరిగే విపక్షాల సమావేశంలో 12 పార్టీలకు చెందిన అధ్యక్షులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి డీఎంకే అధ్యక్షుడి హోదాలో సీఎం స్టాలిన్‌ హాజరుకానున్నారు. ఇందుకోసం గురువారం సాయంత్రం చెన్నై నుంచి పట్నాకు ఆయన బయలుదేరి వెళ్ళనున్నారు. 23న జరిగే విపక్షాల ఐక్య కూటమిలో స్టాలిన్‌ పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యేలా సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌తో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వెస్ట్‌బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు మరికొన్ని పార్టీల నేతలు పాలుపంచుకోనున్నారు. ఇదిలావుండగా, ఈనెల 20న మంగళవారం తిరువారూరు వేదికగా జరిగిన కలైంజర్‌ కోట్టం ప్రారంభోత్సవానికి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ హాజరుకావాల్సి ఉండగా, చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమానికి హాజరుకాలేక పోయారు. ఇందులో ప్రసంగించిన సీఎం స్టాలిన్‌, 23న పట్నా వేదికగా జరిగే విపక్షాల సమావేశంలో తాను కూడా పాల్గొంటానని ప్రకటించిన విషయం తెల్సిందే.

Updated Date - 2023-06-22T07:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising