ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chief Minister: నిప్పులు చెరిగిన సీఎం.. రాష్ట్ర హక్కుల్ని కాలరాస్తున్న కేంద్రం

ABN, First Publish Date - 2023-09-18T07:54:56+05:30

బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం రాష్ట్ర హక్కుల్ని కాలరాస్తోందని డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌(CM Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు.

- గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచడమే బీజేపీ సాధించిన విజయం

- ఇప్పుడు కాస్త తగ్గిస్తే ప్రజలు విశ్వసిస్తారా?

- వేలూరులో నిప్పులు చెరిగిన సీఎం

వేలూరు(చెన్నై): బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం రాష్ట్ర హక్కుల్ని కాలరాస్తోందని డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌(CM Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలూరు కందనేరిలో ఆదివారం సాయంత్రం డీఎంకే ‘ముప్పెరుంవిళా’ జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా వివిధ విభాగాల్లో విశేష సేవలందించిన వారికి పురస్కారాలు ప్రదానం చేశారు. పెరియార్‌ పురస్కారం కె.శక్త్యశీలన్‌కు, అన్నా పురస్కారం కె.సుందరానికి, కలైంజర్‌ పురస్కారం ఐ.పెరియస్వామికి, పావేందర్‌ పురస్కారం మల్లికా కదిరవన్‌కు, పేరాసియర్‌ పురస్కారం ఎన్‌.రామస్వామికి సీఎం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పార్టీ కార్యకర్తల కృషి వల్లనే పార్టీ అధ్యక్ష పదవిని, ముఖ్యమంత్రి పదవిని చేపట్టానని కృతజ్ఞతలు తెలిపారు. 75 ఏళ్లపాటు రాజకీయాల్లో కొనసాగడం సామాన్యమైన విషయం కాదని, అదే స్ఫూర్తితో ఇప్పటికీ యువకుడిలా పని చేస్తున్నానని తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry)కి చెందిన 40 లోక్‌సభ స్థానాల్లో ‘ఇండియా’ కూటమి విజయం సాధించాలని, ఇందుకోసం ప్రతి కార్యకర్తా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైద్యులు కావాలనే పేద విద్యార్థుల స్వప్నం నీట్‌ కారణంగా చెదిరిపోయిందన్నారు. కొత్త విద్యావిధానం ద్వారా రాష్ట్ర విద్యాభివృద్ధిని నాశనం చేయాలని కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచడమే కేంద్రంలో తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయమని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లుగా సిలిండర్‌ ధర పెంచి, ఇప్పుడు కొంత తగ్గించినంత మాత్రాన ప్రజలు విశ్వసించబోరని సీఎం వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-09-19T00:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising