Chief Minister: అసలు విషయం చెప్పేసిన ముఖ్యమంత్రి.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-07-05T07:40:28+05:30
ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తుల్లో తమిళనాడు రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) వెల్లడించా
అడయార్(చెన్నై): ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తుల్లో తమిళనాడు రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘ద్రావిడ పాలన విజయాలకు చిన్న గుర్తుగా ఎలక్ట్రానిక్ వస్తు ఎగుమతిలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారుల తొలి చిరునామాగా తమిళనాడు(Tamil Nadu)ను మార్చి, దక్షిణాసియాలో పెట్టుబడులను ఆకర్షించే మొదటి కేంద్రంగా రాష్ట్రాన్ని చేసేందుకు శ్రమిద్దాం. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశోధించి, వాటిలోని మెరుగైన వాటిని ఒడిసి పట్టుకుందాం’ అంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
Updated Date - 2023-07-05T07:40:28+05:30 IST