ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: శుభవార్త చెప్పిన సీఎం.. అదేంటో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-04-14T10:23:51+05:30

ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ... ప్రజలకు ఆమోదయోగ్యమైన పనులు చేయడమే తమ అభిమతమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చెన్నై, (ఆంధ్రజ్యోతి): వన్నియార్లకు రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) శాసనసభలో ప్రకటించారు. వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్ల అమలుకోసం ఏర్పాటైన కమిటీ గడువును మరో ఆరు మాసాలపాటు పొడిగించడాన్ని నిరసిస్తూ పీఎంకే సభాపక్ష నేత జీకే మణి గురువారం సావధాన తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగించారు. రిజర్వేషన్ల కమిటీ గడువును ఆరుమాసాలకు బదులుగా నెలరోజులు పొడిగిస్తే సమంజసంగా ఉంటుందని, ఇప్పటికే వన్నియార్లు తీవ్రంగా నష్టపోయారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడినవారుగా వన్నియార్లు విద్య, ఉపాధిలో తగినంత అవకాశాలు పొందలేకున్నారని తెలిపారు. బీసీల కమిటీ ఏర్పాటైన మూడు మాసాలలోపే నివేదికను సమర్పించి ఉండాలని, ఆరుమాసాలైన తర్వాత మళ్ళీ ఆరుమాసాలపాటు కమిటీ గడువు పొడిగించడం భావ్యమేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) సమాధానం చెబుతూ వన్నియార్లకు రిజర్వేషన్లు కల్పించే విషయమై తమ ప్రభుత్వం వెనుకంజ వేసే ప్రసక్తే లేదని, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మునుపటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఆదరాబాదరాగా వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్లు ప్రకటించిందని, రిజర్వేషన్లను సక్రమంగా చట్టపరమైన అంశాలతో ప్రకటించకపోవడం వల్లే కోర్టు స్టే విధించిందన్న విషయాన్ని పీఎంకే(PMK) సభ్యులు మరువకూడదన్నారు. అంతేకాకుండా అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్లు కదా అని ఆ ప్రతిపాదనను తమ ప్రభుత్వం బుట్టదాఖలు చేయలేదని, కోర్టులో పటిష్టమైన వాదనలు కూడా వినిపిస్తున్నామని స్టాలిన్‌ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. వన్నియార్లకు రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేసి తీరుతామని పీఎంకే సభాపక్ష నాయకుడు జీకే మణికి ఆయన భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-04-14T10:23:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising