ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vivek Ramaswamy: పౌరసత్వం జన్మహక్కుగా వద్దు

ABN, First Publish Date - 2023-09-29T06:07:25+05:30

తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే జన్మహక్కుగా పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలుకుతానని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధక్ష రేసులో ఉన్న భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి చెప్పారు.

ట్రంప్‌ ఆలోచనలను వినిపిస్తున్న వివేక్‌ రామస్వామి

రిపబ్లికన్‌ ఆశావహుల రెండో చర్చలో సంచలన ప్రతిపాదన

వాషింగ్టన్‌, సెప్టెంబరు 28: తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే జన్మహక్కుగా పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలుకుతానని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధక్ష రేసులో ఉన్న భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి చెప్పారు. అమెరికాలోని అక్రమ వలసదారుల పిల్లలకు పౌరసత్వం జన్మహక్కుగా లభించకూడదని తేల్చిచెప్పారు. రిపబ్లికన్‌ పార్టీ అమెరికా అధ్యక్ష ఆశావహుల రెండో చర్చలోనూ రామస్వామి.. విధానాల్లో పలు కఠినమైన మార్పులను ప్రతిపాదించారు. బుధవారం కాలిఫోర్నియా రాష్ట్రం సిమీ వ్యాలీలోని రోనాల్డ్‌ రీగన్‌ ప్రెసిడెన్షియల్‌ లైబ్రరీ అండ్‌ మ్యూజియంలో ఈ చర్చ నిర్వహించారు. రామస్వామితోపాటు మరో భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డెశాంటిస్‌ సహా మొత్తం ఏడుగురు ఆశావహులు ఈ చర్చలో పాల్గొన్నారు. పత్రాలు లేని వలసదారులను, వారికి అమెరికాలో పుట్టిన పిల్లలను దేశం నుంచి బహిష్కరించడానికి ఎలాంటి చట్టం ఉండాలనుకుంటున్నారని ప్రశ్నించగా, 2015లో అప్పటి అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించినట్టు పౌరసత్వం జన్మహక్కుగా లభించకూడదని రామస్వామి తేల్చిచెప్పారని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ప్రచురించింది.


కాగా, అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరూ అమెరికా పౌరులేనని అమెరికా రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను అత్యధికులు సమర్థిస్తుండగా, కొంతమంది న్యాయ నిపుణులు మాత్రం ఇందులో పరిమితులు ఉండాలని వాదిస్తున్నారు. అందుకే రామస్వామి తాజాగా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. తల్లిదండ్రులు అమెరికా చట్టాన్ని అతిక్రమించినందున, వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం కల్పించకూడదని రామస్వామి నొక్కి చెప్పారు. కాగా, తన ప్రత్యర్థులు ప్రతిపాదించిన.. దేశ దక్షిణ సరిహద్దులో సైన్యం మోహరింపు, అభయారణ్యాల నగరాలకు నిధుల నిలిపివేత, మెక్సికో, సెంట్రల్‌ అమెరికాలకు విదేశీ సాయం నిలిపివేత తదితర ప్రతిపాదనలను రామస్వామి సమర్థించారు. ఆగస్టు 23న నిర్వహించిన రిపబ్లికన్‌ ఆశావహుల తొలి చర్చలోనూ రామస్వామి పలు సంచలన ప్రతిపాదనలు చేశారు. వీసాల మంజూరులో లాటరీ విధానానికి స్వస్థి పలుకుతానని, అమెరికాకు అవసరమైన నైపుణ్యం ఆధారంగా వీసాల మంజూరు ఉండాలని పేర్కొన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 75 శాతం మందిని తొలగిస్తానని చెప్పారు.

Updated Date - 2023-09-29T10:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising