ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court : సీజేఐ చంద్రచూడ్ చేసిన పనికి ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు జడ్జిలు

ABN, First Publish Date - 2023-01-06T17:30:59+05:30

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శుక్రవారం అందరినీ ఆశ్చర్యపరిచారు.

CJI Justice DY Chandrachud , Mahi, Priyanka (File Photo)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శుక్రవారం అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన తన పెంపుడు కుమార్తెలను సుప్రీంకోర్టు (Supreme Court)కు తీసుకొచ్చి, తన చాంబర్‌ను చూపించి, కోర్టు కార్యకలాపాలను వివరించడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆసక్తిగా గమనించారు.

ప్రియాంక (20), మహి (16) అనే ఇద్దరు దివ్యాంగులను జస్టిస్ చంద్రచూడ్ తన కుమార్తెలుగా పెంచుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆయన సుప్రీంకోర్టుకు వచ్చారు. పబ్లిక్ గ్యాలరీ నుంచి వారు కోర్టులోకి ప్రవేశించారు. ఆ తర్వాత వారు ఒకటో గదిలోని సీజేఐ కోర్ట్‌కు వెళ్ళారు. కోర్టు కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతాయో వారికి ఆయన వివరించారు. జడ్జిలు ఎక్కడ కూర్చుంటారు? న్యాయవాదులు ఎక్కడి నుంచి వాదనలు వినిపిస్తారు? అనే అంశాలను వివరించారు. అనంతరం ఆయన వారిద్దరినీ తన చాంబర్‌కు తీసుకెళ్ళారు.

సుప్రీంకోర్టును చూడాలని ఉందని ప్రియాంక, మహి కోరడంతో జస్టిస్ చంద్రచూడ్ వారిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-01-06T17:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising