Teachers Regularisation: 14 వేల కాంట్రాక్టు టీచర్ల పర్మినెంట్
ABN, First Publish Date - 2023-06-10T21:21:58+05:30
క్యాబినెట్ నిర్ణయం ప్రకారం కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న, అనివార్య కార్యణాల వల్ల పదేళ్లకు మించి సర్వీసు చేయలేకపోయిన 14,239 మంది కాంట్రాక్టు టీచర్లను రెగ్యులరైజ్ చేయనున్నారు.
ఛండీగఢ్: భగవంత్ సింగ్ మాన్ (Bhagwant Mann) సారథ్యంలోని పంజాబ్ (Punjab) ప్రభుత్వం కాంట్రాక్టు టీచర్లకు (Contractual Teacher) శుభవార్త చెప్పింది. 14,000 మంది కాంట్రాక్టు టీచర్ల సర్వీసును రెగ్యులరైజ్ (Regularise) చేస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు పంజాబ్ మంత్రివర్గం శనివారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం అధ్యక్షతన బచత్ భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎంఓ ప్రతినిధి తెలిపారు.
క్యాబినెట్ నిర్ణయం ప్రకారం కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న, అనివార్య కార్యణాల వల్ల పదేళ్లకు మించి సర్వీసు చేయలేకపోయిన 14,239 మంది కాంట్రాక్టు టీచర్లను రెగ్యులరైజ్ చేయనున్నారు. వీరిలో కనీసం పదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు 7,902 మంది, రకరకాల కారణాలతో పదేళ్ల సర్వీసుకు గ్యాప్ వచ్చిన 6,337 మంది ఉన్నారు. కొంత గ్యాప్ కారణంగా పదేళ్లు సర్వీసు పూర్తి చేయలేకపోయిన వారిని కూడా సర్వీసు పూర్తి చేసిన వారిగా పరిగణించి రెగ్యులరైజ్ చేయాలని సీఎం నిర్ణయించినట్టు సీఎంఓ ప్రతినిధి చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున కాంట్రాక్టు టీచర్ల సర్వీసును క్రమబద్ధీకరించడం పంజాబ్ చరిత్రలో ఇదే ప్రథమం.
Updated Date - 2023-06-10T21:30:33+05:30 IST