ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Irshalwadi landslide : పెద్ద మనసు చాటుకున్న సీఎం

ABN, First Publish Date - 2023-07-22T19:27:44+05:30

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పెద్ద మనసు చాటుకున్నారు. రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షల్‌వాడిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది చిన్నారులను దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) పెద్ద మనసు చాటుకున్నారు. రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షల్‌వాడి (Irshalwadi)లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది చిన్నారులను దత్తత తీసుకోవాలని (Adoption) నిర్ణయం తీసుకున్నారు.


గిరిజన ప్రాంతమైన ఇర్షల్‌వాడిలో గత బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి చెందగా, 80 మంది జాడ గల్లంతైంది. శనివారంనాడు మరో రెండు మృతదేహాలను వెలిగితీయడంతో మృతుల సంఖ్య 24కు పెరిగింది. శివసేన నేతలతో కలిసి మహారాష్ట్ర స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్‌పర్సన్ నీలమ్ గోర్హె ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది అనాథ పిల్లలను దత్తత చేసుకుంటానని ముఖ్యమంత్రి ప్రకటించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కుమారుడు, కల్యాణ్ ఎంపీ డాక్టర్ శ్రీకాంత్ షిండే నడుపుతున్న శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ (ఎన్‌జీఓ) కింద ఈ చిన్నారులు ఆశ్రయం పొందుతారని, చదువు, వసతి సహా అన్ని ఖర్చులనూ పౌండేషన్ భరిస్తుందని తెలిపారు.


సీఎం ఇంతకుముందు కూడా...

ఏక్‌నాథ్ షిండే గతంలోనూ పలువురు పిల్లలను దత్తత తీసుకుని వారికి గార్డియన్‌గా ఉన్నారు. 2020లో హమద్‌లో తారిఖ్ గార్డెన్ భవంతి కూలిపోయినప్పుడు అనాథలైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. 2020 కూలీ పని చేసుకునే భార్యభార్తలు పాల్ఘార్ జిల్లాలో ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరి పిల్లల్ని కూడా షిండే దత్తత తీసుకున్నారు.


తల్లిదండ్రులను కోల్పోయిన అనేక మంది పిల్లలు ఆశ్రమ్ స్కూలులో ఉన్నారని, వారంతా 2 నుంచి 15 ఏళ్ల వారేనని షిండే ఒక ట్వీట్‌లో తెలిపారు. దుఃఖంతో, భవిష్యత్ అగోమ్యగోచరంగా మారిన పిల్లలకు కష్ట సమయంలో ఎవరో ఒకరు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని, వారికి ప్రేమను పంచాలని, వారిలో ఆత్మస్థైర్యం నింపాలని, అది సమాజంలో ఉంటున్న మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.

Updated Date - 2023-07-22T19:27:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising