ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM, Finance Minister: అసలు ఆ ఆడియో టేపుల్లో ఏముందో..!

ABN, First Publish Date - 2023-05-02T10:36:31+05:30

పార్టీ అధిష్ఠానం పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): పార్టీ అధిష్ఠానం పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌(Minister Palanivel Thyagarajan) సోమవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌Chief Minister MK Stalin)తో భేటీ అయ్యారు. పళనివేల్‌ ఆడియో వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న తరుణంలో ఆయన సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి ముందు మంత్రి పళనివేల్‌ గత నెల 25న సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆ తర్వాత సోమవారం మరోమారు సమావేశం కావడం గమనార్హం. ఈనెల 2వ తేదీ మంగళవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఇందులో అనేక విషయాలను చర్చించనున్నారు. అదేసమయంలో తన ఆడియో వ్యవహారంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది. కాగా, విత్తమంత్రి పళనివేల్‌ మాట్లాడినట్టుగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.అన్నామలై రెండు ఆడియోలను రిలీజ్‌ చేశారు. మొదటి ఆడియోలో గత రెండేళ్ళలో రూ.30 వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అన్నామలై(Annamalai) విడుదల చేసిన రెండో ఆడియోతో నిర్ధరణ అయ్యాయి. అదేసమయంలో తన కేసు విచారణ కోర్టుకు వస్తే ఆ సమయంలో పళనివేల్‌ మాట్లాడిన ఒరిజినల్‌ ఆడియోను బహిర్గతం చేయడమే కాకుండా, కోర్టుకు సమర్పిస్తానని, అలాగే, మరికొన్ని ఆధారాలను కూడా వెల్లడిస్తానని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సీఎంతో మంత్రి పళనివేల్‌ సమావేశమై వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది. అయితే ఆయన వివరణపై సీఎం అసంతృప్తిగానే ఉన్నట్లు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2023-05-02T10:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising