ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Stalin: రెండేళ్లలో రూ.2.97 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం..

ABN, First Publish Date - 2023-08-23T08:58:40+05:30

తన సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత రెండేళ్లలో ఉత్పత్తి రంగంలో రూ.2.97 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులను ఆకర్షించినట్టు

- ఆర్థిక సలహాదారులతో సీఎం

అడయార్‌(చెన్నై): తన సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత రెండేళ్లలో ఉత్పత్తి రంగంలో రూ.2.97 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులను ఆకర్షించినట్టు సీఎం స్టాలిన్‌(CM Stalin) వెల్లడించారు. ఆయన మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్ర ఆర్థిక సలహాదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేర్చే విషయంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి రూపకల్పన చేయడం మొదలుకుని, అది పక్కాగా అమలయ్యేంత వరకు, అనేక రంగాలకు చెందిన నిపుణుల అభిప్రాయాలు సేకరించడం, ఆలకించడంతో పాటు మేటి ఆర్థిక నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నామన్నారు. ఉత్పత్తి రంగంలో గత రెండేళ్లలో మిత్సుబిషి వంటి విదేశీ కంపెనీలతో 241 ఒప్పందాలు కుదుర్చుకుని రూ.2,97,196 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు గుర్తు చేశారు.

‘మక్కలై తేడి మరుత్తువం’ అనే పథకం వల్ల పేద, మధ్య తరగతి ప్రజల వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గాయన్నారు. ఈ పథకం ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఇచ్చిన నివేదికలో పేర్కొందని తెలిపారు. ఈ పథకానికి దీటుగా విద్యా శాఖలో ‘ఇల్లం తేడి కల్వి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టగా, దాని కింద ఇప్పటివరకు 27 లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందారని చెప్పారు. ఈ యేడాది సెప్టెంబరు నెలను ద్రావిడ మాసంగా పాటిస్తున్నట్టు చెప్పారు. అన్నా జయంతి రోజైన సెప్టెంబరు 15వ తేదీ నుంచి కలైంజర్‌ మగళీర్‌ ఉరిమై తొగై పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. కుటుంబం కోసం జీవితాంతం అవిశ్రాంతంగా పనిచేసే మహిళా మణులకు ఈ పథకం తగిన గుర్తింపునిస్తుందన్నారు. ప్రభుత్వ కలల పథకమైన ‘మహిళలకు నెలకు రూ.1000’ కోసం అర్హులైన మహిళల ఎంపిక శరవేగంగా సాగుతోందన్నారు. ఇప్పటికే 1.54 కోట్ల దరఖాస్తులు వచ్చాయని, ఇలాంటి పఽథకాల రూపకల్పనలో ఆర్థిక సలహాదారుల సూచనలు, సలహాలు అమూల్యమైనవని సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-08-23T09:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising