ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congratulations to ISRO team: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ప్రముఖులు

ABN, First Publish Date - 2023-07-14T18:32:17+05:30

చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ యువత నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan mohan Reddy), క్రికెటర్ సచిన్ అభినందనలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ యువత నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan mohan Reddy), క్రికెటర్ సచిన్ అభినందనలు తెలిపారు.

భారతదేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్-3 కొత్త అధ్యాయాన్ని లిఖించిందని, ఇది ప్రతి భారతీయుడి కలలు, ఆశయాలను ఉన్నతంగా ఎగురవేస్తుందని, ఈ మహత్తర విజయం మన శాస్త్రవేత్తల నిర్విరామ అంకితభావానికి నిదర్శనమని మోదీ ట్వీట్ చేశారు.

నేడు మనలో వందకోట్ల కంటే ఎక్కువ మంది గర్వంతో ప్రకాశిస్తూ ఆకాశం వైపు చూస్తున్నారని రాహుల్ అన్నారు. ఈ మిషన్ విజయవంతమైతే చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన నాల్గవ దేశంగా మనల్ని తీర్చిదిద్దుతుందని, ఇస్రో బృందానికి అభినందనలు తెలుపుతూ రాహుల్ ట్వీట్ చేశారు.

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం భారతీయులందరికీ మరపురాని రోజు...జై హింద్! అంటూ సచిన్ ట్వీట్ చేశారు. అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు.

భారత దేశం గర్వించే విధంగా చంద్రయాన్-3 రాకెట్‌ ను నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం (Shaar Rocket Launch Center) రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు షార్‌కు తరలి వచ్చారు

Updated Date - 2023-07-14T18:37:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising