ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Assembly Elections: మోదీని ఖర్గే అంత మాట అనేశారే!

ABN, First Publish Date - 2023-04-27T17:20:56+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (PM Modi) కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Kharge ) అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Mallikarjun Kharge comment on PM Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (PM Modi) కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Kharge ) అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీని విష పాముతో (poisonous snake) పోల్చారు. కలబుర్గిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ విషపాము అని విషం ఉందా లేదా అని నాకి చూస్తే చచ్చి ఊరుకుంటారని ఖర్గే అన్నారు. అయితే తన వ్యాఖ్యలు మోదీపై కాదని, బీజేపీపై అని ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఖర్గే మనసులో విషం ఉందని అందుకే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై విమర్శించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఖర్గే వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాంగ్రెస్ పెద్దల మెప్పుకోసం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. ఖర్గే అనుచిత వ్యాఖ్యల రగడ ఎన్నికలు పూర్తయ్యే వరకూ కొనసాగేలా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కాంగ్రెస్ నాయకులు గతంలో కూడా మోదీని వ్యక్తిగతంగా విమర్శించి దెబ్బ తిన్నారు. మోదీని మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి) అని స్వయంగా సోనియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి చాయ్ అమ్ముకోమని మణిశంకర్ అయ్యర్ గతంలో విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాగే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు మోదీని వ్యక్తిగతంగా విమర్శించారు. ఎన్నికల్లో మాత్రం లబ్ది పొందలేకపోయారు.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-27T17:26:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising