Rajasthan Assembly Elctions: సర్దార్‌పుర నుంచి గెహ్లాట్, టోంక్ నుంచి పైలట్
ABN, First Publish Date - 2023-10-21T15:18:40+05:30
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది. 33 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ఈ జాబితాలో ప్రకటించింది. సర్దార్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ పోటీ చేయనుండగా, టోంక్ నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు.
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ (Congress) పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. 33 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ఈ జాబితాలో ప్రకటించింది. సర్దార్‌పుర (Sardarpura) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) పోటీ చేయనుండగా, టోంక్ (Tonk) నియోజకవర్గం నుంచి సచిన్ పైలట్ (Sachin pilot) పోటీ చేస్తున్నారు. నాథ్‌ద్వారా నుంచి సీపీ జోషి, ఓసియన్ నుంచి దివ్య మడెర్న, లక్ష్మణ్‌గఢ్ నుంచి గోవింద్ సింగ్ డోటసర, సాదుల్‌పూర్ నుంచి కృష్ణ పునియా బరిలో ఉన్నారు.
కాగా, శనివారంనాడే 83 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 200 మంది సభ్యుల అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న ఎన్నికలు జరగాల్సి ఉండగా, వివిధ వర్గాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని నవంబర్ 25వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ఇటీవల ప్రకటించింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.
Updated Date - 2023-10-21T15:27:02+05:30 IST