ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress TS Singh Deo: ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. ప్లేటు తిప్పేసిన డిప్యూటీ సీఎం.. ప్రధాని మోదీపై..?

ABN, First Publish Date - 2023-09-16T15:32:18+05:30

రాజకీయాలు ‘చదరంగం’ లాంటివి. ఎప్పుడు, ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. నిన్నటిదాకా బద్ద శత్రువుల్లా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న నేతలు.. రాత్రికి రాత్రే చేతులు కలపొచ్చు. తమ ప్రత్యర్థుల్ని...

రాజకీయాలు ‘చదరంగం’ లాంటివి. ఎప్పుడు, ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. నిన్నటిదాకా బద్ద శత్రువుల్లా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న నేతలు.. రాత్రికి రాత్రే చేతులు కలపొచ్చు. తమ ప్రత్యర్థుల్ని ఆకాశానికెత్తేస్తూ.. ప్రశంసలు కురిపించొచ్చు. ముఖ్యంగా.. ఎన్నికలు సమయంలో ఇలాంటి అనూహ్య ట్విస్టులు వెలుగు చూస్తుంటాయి. లేటెస్ట్‌గా ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇలాంటి దిమ్మతిరిగే ట్విస్ట్ ఒకటి వెలుగు చూసింది. కాంగ్రెస్ పార్టీ నేత, ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి టీఎస్ దేవ్ సింగ్ ఒక్కసారిగా ప్లేటు తిప్పేశారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. తమ రాష్ట్రానికి ప్రధాని మోదీ ఎన్నో ఇచ్చారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆ వివరాల్లోకి వెళ్తే..


గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని తొమ్మిది జిల్లాల్లో ‘క్రిటికల్ కేర్ బ్లాక్‌’లకు శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. ఒక లక్ష సికిల్ సెల్ కౌన్సెలింగ్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు అనేక ఇతర భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. అంతకుముందు తమ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీని స్వాగతించిన టీఎస్ దేవ్ సింగ్.. మోదీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కేంద్ర మార్గదర్శకత్వంలో మేము రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తున్నాం. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల ఎప్పుడూ వివక్ష చూపించలేదు. ఇప్పుడు కూడా ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏదో ఇవ్వడానికే వచ్చారు. ఇప్పటికే ఆయన రాష్ట్రానికి ఎన్నో ఇచ్చారు. ఎన్నో భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో కూడా మరెన్నో ప్రాజెక్టులు అందిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. 2018లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ విజయం సాధించాక ముఖ్యమంత్రి పీఠం కోసం భూపేష్ బఘేల్, టీఎస్ దేవ్ మధ్య విస్తృత పోటీ నెలకొంది. చివరికి.. కాంగ్రెస్ పార్టీ బఘేల్‌కే సీఎం బాధ్యతలు అప్పజెప్పింది. అప్పటి నుంచే టీఎస్ దేవ్ పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తపరుస్తూ వస్తున్నారు. అయితే.. కాంగ్రెస్‌కు విధేయతగా ఉన్నందుకు గాను పార్టీ అధిష్టానం ఆయనకు ఉపముఖ్యమంత్రిగా నియమించింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. టీఎస్ దేవ్ ప్రధానిపై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. చూస్తుంటే.. ఎన్నికలప్పుడు టీఎస్ దేవ్ ఏదో ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2023-09-16T15:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising