Sonia Gandhi: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ
ABN, First Publish Date - 2023-09-03T14:19:47+05:30
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ఆదివారంనాడు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. స్వల్పంగా జ్వరం రావడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) ఆదివారంనాడు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. స్వల్పంగా జ్వరం రావడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
సోనియాగాంధీ ఇంతకుముందు కూడా వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో సర్ గంగరామ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. సెప్టెంబర్ 1న ముంబైలో జరిగిన విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.) సమావేశానికి సోనియాగాంధీ హాజరయ్యారు.
Updated Date - 2023-09-03T14:19:47+05:30 IST