ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Flying kiss: రాహుల్‌కు పడుచు అమ్మాయిలు కొదవా?.. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే వ్యాఖ్య

ABN, First Publish Date - 2023-08-11T21:08:51+05:30

పార్లమెంటులో రాహుల్ గాంధీ 'ఫ్లయింగ్ కిస్' వివాదంపై మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలను బీహార్‌కు చెందిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే నీతూ సింగ్ తిప్పికొట్టారు.''మా నాయకుడు రాహుల్ గాంధీకి పడుచు అమ్మాయిల కొరతేమీ లేదు'' అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

న్యూఢిల్లీ: పార్లమెంటులో రాహుల్ గాంధీ (Rahul Gandhi) 'ఫ్లయింగ్ కిస్' (Flying Kiss) వివాదంపై మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irnani) చేసిన వ్యాఖ్యలను బీహార్‌కు చెందిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే నీతూ సింగ్ (Neetu Singh) తిప్పికొట్టారు.''మా నాయకుడు రాహుల్ గాంధీకి పడుచు అమ్మాయిల కొరతేమీ లేదు'' అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


''రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఉంటే, ఆయన పడుచు అమ్మాయికే ఇచ్చి ఉండొచ్చు. 50 ఏళ్ల మహిళలకు ఎందుకు ఫ్లయింగ్ కిస్ ఇస్తారు?'' అని నీతు సింగ్ ప్రశ్నించారు. రాహుల్‌పై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని అన్నారు.


కాగా, నీతూ సింగ్ వ్యాఖ్యల వీడియోను బీజేపీ ప్రతినిధి షెహ్‌జాద్ పూనావాలా ట్విట్టర్‌లో షేర్ చేశారు. మహిళా వ్యతిరేకి అయిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పార్లమెంటులో పాల్పడిన తప్పిదాలను కూడా సమర్ధిస్తోందని విమర్శించారు.


కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. చర్చ ముగించిన అనంతరం ఆయన పార్లమెంటు నుంచి వెళ్లిపోతూ 'ఫ్లయింగ్ కిస్' ఇచ్చారంటూ ఆయన తర్వాత చర్చలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. మహిళా సభ్యులు కూడా కూర్చున్న సభలో ఇలాంటి అనుచిత ప్రవర్తన ఏమిటని నిలదీశారు. దేశ పార్లమెటు చరిత్రలో తాను ఎన్నడూ ఇలాంటిది చూడలేదన్నారు. దీనిపై పలువురు మహిళా ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు కూడా చేశారు. కాగా, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. సభను వీడివెళ్తుతున్న సంకేతంగానే రాహుల్ చర్య ఉందని, ఇందులో తప్పుపట్టాల్సిన అవసరం ఏమీ లేదని పేర్కొంది.

Updated Date - 2023-08-11T21:16:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising