ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi : త్వరలో యూరోపియన్ దేశాల పర్యటనకు రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2023-08-12T11:52:33+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త్వరలో యూరోపియన్ దేశాల్లో పర్యటించబోతున్నారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులతో బ్రసెల్స్‌లో సమావేశమవుతారు. ఫ్రాన్స్, బెల్జియంలలో భారతీయు మూలాలుగలవారిని కలిసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఆయన నార్వేను కూడా సందర్శించబోతున్నారు.

Rahul Gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) త్వరలో యూరోపియన్ దేశాల్లో పర్యటించబోతున్నారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులతో బ్రసెల్స్‌లో సమావేశమవుతారు. ఫ్రాన్స్, బెల్జియంలలో భారతీయు మూలాలుగలవారిని కలిసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఆయన నార్వేను కూడా సందర్శించబోతున్నారు.

రాహుల్ గాంధీ సెప్టెంబరు 7 నుంచి 11 వరకు బెల్జియం, నార్వే, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదిలో ఆయన బ్రిటన్, అమెరికాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో బ్రిటన్‌లోనూ, జూన్‌లో అమెరికాలోనూ ఆయన పర్యటించారు.

బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ, భారత దేశంలో ప్రజాస్వామ్యం దాడికి, ఒత్తిళ్లకు గురవుతోందని ఆరోపించారు. దేశంలోని అన్ని వ్యవస్థలూ కబ్జాకు గురయ్యాయని, మీడియా, న్యాయ వ్యవస్థలను నియంత్రిస్తున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలు బెదిరిస్తున్నాయని, దళితులు, గిరిజనులు, అల్ప సంఖ్యాకులపై దాడులు జరుగుతున్నాయని, అసమ్మతిని అణచివేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆయనపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. విదేశీ గడ్డపై నుంచి భారత దేశాన్ని కించపరుస్తున్నారని ఆరోపించింది.


ఇవి కూడా చదవండి :

UP Assembly : నవ్వులు పూయించిన యోగి ఆదిత్యనాథ్, శివపాల్ యాదవ్ సంభాషణ

Bharatiya Nyaya Sanhita : పెళ్లి పేరుతో మహిళను అనుభవించే దుష్టుడికి పదేళ్ల జైలు శిక్ష.. కేంద్రం ప్రతిపాదన..

Updated Date - 2023-08-12T11:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising