ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bharat Jodo: భారత్ జోడో యాత్రకు ఏడాది.. 7న దేశవ్యాప్తంగా జిల్లాల్లో పాదయాత్రలు

ABN, First Publish Date - 2023-09-03T16:27:31+05:30

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ జరిపిన 'భారత జోడో యాత్ర' ఏడాది పూర్తికావస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ 'భారత్ జోడో యాత్ర'ను నిర్వహించనుంది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ జరిపిన 'భారత జోడో యాత్ర' (Bharat Jodo Yatra)కు ఏడాది పూర్తికావస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ 'భారత్ జోడో యాత్ర'ను నిర్వహించనుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.


రాహుల్ గాంధీ గత ఏడాది సెప్టెంబర్‌లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 130 రోజుల పాటు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర సక్సెస్ కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ సంపూర్ణ మెజారిటీతో గెలిచింది. రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' రెండవ విడతను గుజరాత్ నుంచి మేఘాలయ వరకూ చేపడతారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఇటీవల తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున దీనికి ముందే రాహుల్ రెండో విడత భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయని అంచనా వేస్తు్న్నారు.

Updated Date - 2023-09-03T16:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising