Narendra Modi: హిందువులను విభజించేందుకే కాంగ్రెస్ కులగణన జపం..
ABN, First Publish Date - 2023-10-03T17:11:12+05:30
ఎక్కువ మంది జనాభా ఉన్న వారికి ఎక్కువ హక్కులుండాలని, దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చేస్తున్న డిమాండ్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. హిందువులను విభజించడం ద్వారా దేశాన్ని ధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని తప్పుపట్టారు.
జగదల్‌పూర్: ఎక్కువ మంది జనాభా ఉన్న వారికి ఎక్కువ హక్కులుండాలని, దేశవ్యాప్తంగా కులగణన (Caste census) జరపాలని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చేస్తున్న డిమాండ్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విరుచుకుపడ్డారు. హిందువులను విభజించడం ద్వారా దేశాన్ని ధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని తప్పుపట్టారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని బస్తర్ జిల్లా జగదల్‌పూర్‌లో మంగళవారంనాడు జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కొత్త పల్లవి అందుకుందన్నారు.
''జనాభాలో ఎక్కువ శాతం ఉన్న వారికి ఎక్కువ హక్కులుండాలంటూ కాంగ్రెస్ నేతలు కొత్త ట్యూన్ అందుకున్నారు. దేశంలో పేదల జనాభానే ఎక్కువని నేను చెప్పదలచుకున్నాను. దేశంలో ఎక్కువ జనాభా ఎవరైనా ఉన్నారంటే వాళ్లు పేదలే. వాళ్ల సంక్షేమమే నా లక్ష్యం'' అని మోదీ అన్నారు. దేశ వనరుల్లో తొలి హక్కు మైనారిటీలకేనని, అందులో ముస్లింలకే తొలి రైట్ అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేవారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రాతిపదికగానే హక్కులు, వాటాలు అంటోందని ఆయన తెలిపారు. ఆ ప్రకారం మైనారిటీల హక్కులను ఊడలాక్కోవాలని కాంగ్రెస్ కోరుకుంటోందా? జనాభా ఆధారంగానే హక్కులు నిర్ణయించాల్సి వస్తే అన్ని హక్కుల కోసం అత్యధిక జనాభా కలిగిన హిందువులు ముందుకొస్తారా? అని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ వ్యక్తులు నడపడం లేదని, సీనియర్ నేతలు మిన్నకుంటున్నారని, ఇదేమిటని ప్రశ్నించడం లేదని, కనీసం మాట్లాడే ధైర్యం కూడా చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ఔట్ సోర్సింగ్ బాట పట్టిందని విమర్శించారు.
Updated Date - 2023-10-03T17:11:12+05:30 IST