ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meghalaya polls: పోలింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ..

ABN, First Publish Date - 2023-02-26T12:05:58+05:30

పార్టీల హోరాహోరీ ఎన్నికల ప్రచారానికి తెరపడి మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. సోమవారం ఉదయం7 గంటలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షిల్లాంగ్: పార్టీల హోరాహోరీ ఎన్నికల ప్రచారానికి తెరపడి మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. సోమవారం ఉదయం7 గంటలకు కౌంటింగ్ మొదలై మధ్యాహ్నం 4 గంటలతో ముగియనుంది. పోలింగ్ కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,419 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేఘాలయలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఖాసి, జైన్‌టియా హిల్స్ రీజియన్‌లో 36 నియోజకవర్గాలు, గరో హిల్స్ రీజియన్‌లో 24 ని యోజకవర్గాలు ఉన్నాయి. 21 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో 10.99 లక్షల మంది మహిళలు, 10.68 లక్షల మంది పురుషులు ఉన్నాయి. పురుషులతో పోల్చుకుంటే ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. 81,000 మంది తొలిసారి ఓటు వేస్తున్నారు. 369 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, వీరిలో 36 మంది మహిళలున్నాయి.

కాగా, మొత్తం 3,419 పోలింగ్ స్టేషన్లలో 120 పోలింగ్ స్టేషన్లు పూర్తిగా మహిళల నిర్వహణలో ఉండగా, 60 మోడల్ పోలింగ్ స్టేషన్లు, మరో 60 పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 119 పారామెడికల్ కంపెనీలను ఎన్నికల కమిషన్ మోహరించింది. మార్చి 2వ తేదీ వరకూ మేఘాలయ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాలని ఎన్నికల సంఘం శనివారంనాడు ఆదేశించింది. మేఘాలయకు బంగ్లాదేశ్‌తో 443 కిలోమీటర్ల సరిహద్దు, అసోంతో 885 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. రాష్ట్రంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ముందస్తు చర్యలు తీసుకున్నామని, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి 144 సెక్షన్ అమల్లోకి తెచ్చామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఎఫ్ఆర్ ఖర్గోంగోర్ తెలిపారు.

మోజారిటీ మార్క్ 31..

అసెంబ్లీ ఎన్నికల్లో 31 నియోజకవర్గాలు గెలుచుకుంటే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ లభించినట్టే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌డీపీ) 19 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 21 సీట్లు, బీజేపీ 2 సీట్లు, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) 6 సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ఎన్‌డీపీ సారథ్యంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎండీఏ) యూడీపీ, బీజేపీ సహా పలు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి బీజేపీ, ఎన్‌పీపీ ఎలాంటి ముందస్తు ఎన్నికల పొత్తు లేకుండా సోలోగా ఎన్నికలకు వెళ్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ అన్ని సీట్లలోనూ పోటీ చేస్తున్నాయి. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ 2021లో మేఘాలయలో ప్రధాన విపక్ష పార్టీగా నిలిచింది. టీఎంసీ ఈసారి 58 సీట్లలో తమ అభ్యర్థులను నిలిపింది.

ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. సౌత్ తుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, ఎన్‌పీపీ చీఫ్‌కు ప్రత్యర్థిగా బెన్రాడ్ ఎన్.మారక్‌ను బీజేపీ బరిలోకి దింపింది. మాజీ సీఎం ముకుల్ సంగ్మా రెండు సీట్లలో తృణమూల్ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. యూడీపీ నేత మెతబా లింగ్డో... మైరాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మోఘాలయ ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడింది. ఎన్డీపీ, బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ పార్టీలు తమ శక్తియుక్తులన్నీ ఉపయోగించి ప్రచారం సాగించాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీనడ్డా, అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రచారం సాగించగా, శుక్రవారంనాడు షిల్లాంగ్‌లో జరిగిన రోడ్‌షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. త్రిపురలో ఎన్నికల ప్రచారానికి హాజరు కాని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, షిల్లాంగ్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. టీఎంసీ సుప్రీం మమతా బెనర్జీ మేఘాలయలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. టీఎంసీ ఎంపీ మెహువా మైత్రీ రాష్ట్రంలో ప్రచారం సాగించారు. మార్చి 2న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.

Updated Date - 2023-02-26T12:05:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising