ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Covid-19: కొత్త రకం కరోనా లక్షణాలు ఇవే!.. వైరస్ సోకకుండా ఉండడానికి ఏం చేయాలంటే..?

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:54 PM

రూపం మార్చుకుని కొత్త వేరియంట్లతో దాడి చేస్తున్న కరోనా మహమ్మారి అందరినీ భయపెడుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 నూతన కరోనా కేసులు నమోదు కావడంతోపాటు ఐదుగురు చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

ప్రజలను కరోనా మహమ్మారి మళ్లీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. రూపం మార్చుకుని కొత్త వేరియంట్లతో దాడి చేస్తోన్న కరోనా మహమ్మారి అందరినీ భయపెడుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 నూతన కరోనా కేసులు నమోదు కావడంతోపాటు ఐదుగురు చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల నమోదవుతున్న వరుస కరోనా కేసులతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701కి చేరింది. జేఎన్-1(JN.1) అనే నూతన కరోనా వేరియంట్‌ను మొదటిసారిగా సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించారు. డిసెంబర్ 15న చైనాలో 7 కేసులు నమోదయ్యాయి. మన దేశంలో మొదటిసారిగా డిసెంబర్ 8న ఈ కొత్త కరోనా కేసు నమోదైంది. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో గల కరకులంలో 79 ఏళ్ల మహిళకు జేఎన్.1 అనే కొత్త రకం కరోనా సోకింది. ఆర్టీ పీసీఆర్ టెస్టులో ఆమెకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. సదరు మహిళలో ఇన్ల్ఫు ఎంజా లైక్ ఇల్‌నెస్ (ILI) తేలికపాటి లక్షణాలు కనిపించాయి. అయితే ఆ తర్వాత ఆమె కోలుకుంది.


ఈ కొత్త రకం కరోనాను పిరోలా వేరియంట్ (BA.2.86), ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వారసురాలిగా చెబుతున్నారు. జేఎన్.1 కొత్త కరోనా స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్ కలిగి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకడంలో స్పైక్ ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తోంది. అమెరికాలో 15 నుంచి 29 శాతం కొత్త రకం కరోనా కేసులు నమోదైనట్టు అంచనా వేస్తున్నారు. జెఎన్.1 నూతన కరోనా లక్షణాల విషయానికొస్తే.. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, దగ్గు, కొన్ని సందర్భాల్లో తేలికపాటి జీర్ణాశయ సమస్యలు ఈ వైరస్ సోకిన వారిలో కనిపిస్తుంటాయి. సరైన నివారణ చర్యలు పాటించకపోతే గతంలో మాదిరిగానే ఈ కొత్త వైరస్ ఎక్కువ మందికి వ్యాపించే అవకాశాలున్నాయి. శానిటైజేషన్‌తో తరచుగా చేతులు కడుక్కోవడం, మాస్కులు వాడడం, సామాజిక దూరం పాటించడం వంటి మార్గాల ద్వారా కరోనా సోకకుండా తప్పించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. వీటితోపాటు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising