ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kesavan meets PM Modi: ప్రధానితో భేటీ అయిన ఈ కుర్రాడిని గుర్తు పట్టారా?

ABN, First Publish Date - 2023-04-12T19:15:02+05:30

ఈ నెల 8న ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.

Kesavan meets PM Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: భారత దేశ తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి (C Rajagopalachari) మునిమనుమడు సీఆర్ కేశవన్ (C R Kesavan) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో(Prime Minister Narendra Modi) సమావేశమయ్యారు. ఈ నెల 8న ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీలో తనకు చోటు కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని చెప్పారు. తనను పార్టీలోకి తీసుకోవడం సి.గోపాలచారితో సహా దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న మహనీయుల పట్ల బీజేపీకి ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. ప్రజల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న విధానాలు, అవినీతిరహిత పాలన మారుతున్న భారతదేశాన్ని ఆవిష్కరిస్తోందని అన్నారు.

అంతకు ముందు, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కేశవన్ రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తన రాజీనామాకు కారణాలను అందులో వివరించారు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిననే గుర్తింపుతో ఇక ఎంతమాత్రం ఉండలేనని, అందుకే జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యతను తిరస్కరించానని అన్నారు. అందుకే భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొనలేక పోయానని చెప్పారు. రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం కోసం పనిచేయడానికి తనను ప్రోత్సహించిన విలువలు ప్రస్తుతం ఏమాత్రం కనిపించడం లేదని, అందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. పార్టీ దేనికి గుర్తుగా ఉందో, దేని కోసం మద్దతుగా నిలుస్తోందో, దానితో తాను ఏకీభవిస్తున్నట్లు మనస్ఫూర్తిగా చెప్పలేనని తెలిపారు. వాటిని తాను ప్రచారం చేయలేనని తెలిపారు. అందుకే సంస్థాగత పదవిని తిరస్కరించానని అన్నారు. ఇప్పుడు నూతన పంథాను తాను నిర్మించుకోవాల్సిన తరుణం వచ్చిందన్నారు. పార్టీలో తనకు వివిధ పదవులు ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-04-12T19:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising