ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP vs Congress: రాహుల్‌ని రావణుడిలా మార్చిన బీజేపీ.. జాతీయ పార్టీల మధ్య మాటల మంటలు

ABN, First Publish Date - 2023-10-05T20:32:43+05:30

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఫొటోను రావణుడిలా మార్చి బీజేపీ(BJP) ఎక్స్(X) హ్యాండిల్ లో పోస్ట్ చేయడం వివాదం రేపింది. మార్ఫింగ్ ఫొటోలో 'రావణ్ ఎ కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్.. డైరెక్షన్ జార్జ్ సోరోస్' అనే టైటిల్స్ ఉన్నాయి.

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఫొటోను రావణుడిలా మార్చి బీజేపీ(BJP) ఎక్స్(X) హ్యాండిల్ లో పోస్ట్ చేయడం వివాదం రేపింది. మార్ఫింగ్ ఫొటోలో 'రావణ్ ఎ కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్.. డైరెక్షన్ జార్జ్ సోరోస్' అనే టైటిల్స్ ఉన్నాయి. 'నూతన యుగం రావణుడు ఈ ఫొటోలో ఉన్నాడు. అతనో రాక్షసుడు. ధర్మానికి బద్ధ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకం, భారత్ ను నాశనం చేయడమే అతడి లక్ష్యం' అని రాహుల్ ని ఉద్దేశించి రాశారు. జార్జ్ సోరోస్ హంగేరియన్ వ్యాపారవేత్త.


ఆయన భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటారని బీజేపీ తరచూ ఆరోపిస్తూ ఉంటుంది. రాహుల్ మార్పింగ్ పోస్ట్‌పై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్(Jairam Ramesh) స్పందించారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి, హింసను ప్రేరేపించడానికి బీజేపీ ఇలాంటి సిల్లీ ట్రిక్స్ కి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ ఇలాంటి పనుల్ని ప్రోత్సహించకూడదని హితవు పలికారు. ఇప్పుడు ఈ ఫొటో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల మంటలు రాజేసింది.

Updated Date - 2023-10-05T20:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising