Delhi Liquor Scam : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై ఢిల్లీ కోర్టు విచారణ
ABN, First Publish Date - 2023-03-24T16:23:42+05:30
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) బెయిలు దరఖాస్తుపై మార్చి 31న తీర్పు చెబుతామని ఢిల్లీ కోర్టు శుక్రవారం తెలిపింది. సిసోడియాకు బెయిలు మంజూరు చేయవద్దని సీబీఐ (Central Bureau of Investigation) కోర్టును కోరింది. సీబీఐ దాఖలు చేసిన పత్రాల నకళ్లను నిందితునికి కోర్టు అందజేసింది. కేసు డైరీ, కొందరు సాక్షుల స్టేట్‌మెంట్లను కూడా అందుబాటులో ఉంచింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) బెయిలు దరఖాస్తుపై మార్చి 31న తీర్పు చెబుతామని ఢిల్లీ కోర్టు శుక్రవారం తెలిపింది. సిసోడియాకు బెయిలు మంజూరు చేయవద్దని సీబీఐ (Central Bureau of Investigation) కోర్టును కోరింది. సీబీఐ దాఖలు చేసిన పత్రాల నకళ్లను నిందితునికి కోర్టు అందజేసింది. కేసు డైరీ, కొందరు సాక్షుల స్టేట్‌మెంట్లను కూడా అందుబాటులో ఉంచింది.
2021-22 ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిసోడియా ఏడు రోజులపాటు సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఆ సమయంలో ఆయనను సీబీఐ ప్రశ్నించింది. సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అరెస్ట్ చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే దాదాపు 11 మంది అరెస్టయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కేసులో అనుమానితురాలని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఆమెను ఇప్పటికే మూడుసార్లు ప్రశ్నించాయి.
ఇవి కూడా చదవండి :
CAG Report : ఏపీ ప్రభుత్వ అప్పులు ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే..
Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ కొత్త ఎత్తుగడ
Updated Date - 2023-03-24T16:23:42+05:30 IST