ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi excise policy cases : మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ

ABN, First Publish Date - 2023-08-04T12:25:21+05:30

అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో శుక్రవారం నిరాశ మిగిలింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Manish Sisodia

న్యూఢిల్లీ : అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో శుక్రవారం నిరాశ మిగిలింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో అరెస్టయి, ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న సిసోడియా తన సతీమణి అనారోగ్యంతో బాధపడుతున్నారని, తనకు బెయిలు మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం సెప్టెంబరు 4కు వాయిదా వేయడంతో ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా రాష్ట్ర ఎక్సయిజ్ విధానం రూపకల్పన, అమలులో అవకతవకలకు, అవినీతికి, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు ఈ కేసులపై దర్యాప్తు జరుపుతున్నాయి.

సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో మనీశ్ సిసోడియాకు బెయిలు మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

సిసోడియా తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ, సిసోడియా సతీమణి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసేందుకు వెళ్లడం కోసం మానవతా దృక్పథంతో ఆయనకు బెయిలు మంజూరు చేయాలని కోర్టును కోరారు. అయితే జస్టిస్ ఖన్నా మాట్లాడుతూ, ఆమె 20 ఏళ్ల నుంచి ఈ అనారోగ్యంతో బాధపడుతున్నారని సీబీఐ తెలిపిందని చెప్పారు.

దీనిపై సింఘ్వి మాట్లాడుతూ, ఆమె ఓ డీజెనరేటి్వ్ వ్యాధితో బాధపడుతున్నారని, అది రాన్రానూ తీవ్రమవుతోందని చెప్పారు. ఆమెను జూన్, జూలై నెలల్లో ఆసుపత్రిలో చేర్పించారన్నారు. వారికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడని, ఆయన విదేశాల్లో ఉన్నారని, అందువల్ల ఆమెను చూసేందుకు ఎవరూ లేరని తెలిపారు. ఆమెకు నడక, కంటి చూపు సమస్యలు ఉన్నాయన్నారు.


ధర్మాసనం స్పందిస్తూ, తాత్కాలిక బెయిలు దరఖాస్తును రెగ్యులర్ బెయిలు దరఖాస్తుతో కలిపి విచారణ జరుపుతామని తెలిపింది. ఇది నెమ్మదిగా పెరిగే వ్యాధి అని, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ఈ దరఖాస్తుపై తాము తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. తదుపరి విచారణ సెప్టెంబరు 4న జరుగుతుందని జస్టిస్ ఖన్నా చెప్పారు.

అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజును ఉద్దేశించి జస్టిస్ ఖన్నా మాట్లాడుతూ, రెగ్యులర్ బెయిలు దరఖాస్తుపై వాదనలు వినిపించేటపుడు ఈ కేసులో ఆర్థిక లావాదేవీలను ఏవిధంగా నిర్థరించారో స్పష్టంగా చెప్పాలన్నారు. అఫిడవిట్‌లో స్పష్టమైన వివరాలు లేవన్నారు.

ఢిల్లీలో మద్యం వ్యాపారాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేసే ఎక్సయిజ్ పాలసీ రూపకల్పనలో అనేక అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా స్పందించారు. దీనిపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయనను ఈడీ మార్చి 9న అరెస్ట్ చేసింది.


ఇవి కూడా చదవండి :

Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

Kedarnath yatra : కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియ.. శిథిలాల్లో 10 మంది చిక్కుకున్నట్లు ఆందోళన..

Updated Date - 2023-08-04T12:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising