ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Excise policy: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. సిసోడియాతో పాటు కవిత మాజీ ఆడిటర్‌‌పై కూడా..

ABN, First Publish Date - 2023-04-25T18:13:37+05:30

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణం (Excise Policy Scam) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ (CBI) మంగళవారంనాడు చార్జిషీటు దాఖలు చేసింది. సిసోడియా పేరును చార్జిషీటులో చేర్చడం ఇదే మొదటిసారి. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ ఈ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో సిసోడియా పేరుతో పాటు, ఇదే కేసులో విచారణ ఎదుర్కొన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు గోరంట్ల (Butchi Babu Gorantla) పేరును కూడా చేర్చింది. వీరితో పాటు అర్జున్ పాండే, అమన్‌దీప్ దాల్ పేర్లు కూడా ఉన్నాయి.

సీబీఐ, ఈడీ నమోదు చేసిన అవినీతి, మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీని ఏప్రిల్ 17న ప్రత్యేక కోర్టు పొడిగించింది. చార్జిషీటులో ఉన్న అంశాలపై మే 15న రౌస్ అవెన్యూ కోర్టు ముందు వాదనలు కొనసాగుతాయి.

ఆసుపత్రిలో సిసోడియా భార్య

కాగా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా మనీష్ సిసోడియా భార్య సీమ సిసోడియా (Seema Sisodia) మంగళవారంనాడు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో ఆమె చేరినట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి. అటో ఇమ్యూన్ డిజార్డర్‌ కారణంగా ఊపిరితిత్తుల సమస్య తలెత్తిందని, దీంతో ఆమె ఆసుపత్రిలో చేరారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యాధి కారణంగా మెదడు క్రమంగా శరీర నియంత్రణను కోల్పోతుందని, ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటున్నారని, కుమారుడు విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారని ఇటీవల కేజ్రీవాల్ సీమ సిసోడియా ఆరోగ్య పరిస్థితిపై చెప్పారు.

Updated Date - 2023-04-25T18:20:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising