ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rs.2,000 Notes: ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 నోట్లు మార్చుకోవచ్చు.. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

ABN, First Publish Date - 2023-05-29T16:15:02+05:30

ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ, ఎస్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు కొట్టివేసింది.

న్యూఢిల్లీ: ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడీ ప్రూఫ్ (ID Proof) లేకుండా రూ.2,000 నోట్లను (Rs.2,000 notes) మార్చుకోవడానికి ఆర్బీఐ (RBI), ఎస్‌బీఐ (SBI) జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (PIL) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సోమవారంనాడు కొట్టివేసింది. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఈనెల 23న వేసిన పిటిషన్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌తో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది.

ఆర్బీఐ, ఎస్‌బీఐ నోటిఫికేషన్లు ఏకపక్షంగా, అహేతుకంగా ఉన్నాయని, రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘిస్తున్నాయని అశ్విని కుమార్ ఉపాధ్యా్య్ తన వాదన వినిపించారు. పెద్ద మొత్తంలో రూ.2,000 కరెన్సీ వ్యక్తుల లాకర్లు, లేదా వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టులు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, మైనింగ్ మాఫియాలు, అవినితిపరుల చేతుల్లోకి వెళ్లాయని, వారు ఈ నోట్లను మార్చుకునే అవకాశం ఉందని ఉపాధ్యాయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆర్బీఐ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ పరాగ్ త్రిపాఠి తన వాదన కొనసాగిస్తూ, దేశ ఆర్థిక విధానాల్లో తాము జోక్యం చేసుకోమని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం పదేపదే చెబుతూనే ఉందని గుర్తుచేశారు. ఉపాధ్యాయ్ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోవడం నోట్ల రద్దు కాదని, చట్టబద్ధమైన చర్య అని, ఇది ఎంతమాత్రం పబ్లిక్ ఇష్యూ కాదని ఆయన వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తు్న్నట్టు ప్రకటించింది.

Updated Date - 2023-05-29T18:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising