ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi excise policy case : సీబీఐ విచారణకు వెళ్లే ముందు సిసోడియా రోడ్ షో

ABN, First Publish Date - 2023-02-26T11:43:26+05:30

ఢిల్లీ మద్యం విధానం కేసులో సీబీఐ (Central Bureau of Investigation) విచారణకు హాజరయ్యే ముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కేసులో సీబీఐ (Central Bureau of Investigation) విచారణకు హాజరయ్యే ముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అత్యధికంగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం తన నివాసం నుంచి బయల్దేరిన సిసోడియా రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు.

సీబీఐ సిసోడియాను వారం క్రితమే విచారణకు పిలిచింది. కానీ ఢిల్లీ బడ్జెట్ రూపకల్పనలో తాను తీరిక లేకుండా గడుపుతున్నానని, తనకు మరింత సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఆదివారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సీబీఐ కోరింది. ఆయనను ఆదివారం అరెస్టు చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు భావిస్తున్నారు.

సిసోడియా ఇచ్చిన ట్వీట్‌లో, ఆదివారం ఉదయం తాను సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతానని తెలిపారు. ఈ దర్యాప్తునకు తాను సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు. లక్షలాది మంది బాలల ప్రేమాభిమానాలు, కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలు తనకు ఉన్నాయన్నారు. కొద్ది నెలలపాటు జైలులో ఉండవలసి వస్తే తాను పట్టించుకోనన్నారు. రాజ్‌ఘాట్ వద్ద మాట్లాడుతూ, తాను భగత్ సింగ్ అనుచరుడినని తెలిపారు. భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారన్నారు. తప్పుడు ఆరోపణలపై జైలుకు వెళ్ళడం తనకు చాలా చిన్న విషయమని చెప్పారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ శుక్రవారం చాలా ఆసక్తికర సంకేతాలు పంపించిన సంగతి తెలిసిందే. సిసోడియాను ఆదివారం సీబీఐ అరెస్టు చేస్తుందని తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని తెలిపారు.

ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు, అక్రమాలపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత ఏడాది ఆదేశించారు. అనంతరం ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుని, పాత విధానాన్నే అమల్లోకి తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి :

Delhi Excise Policy Case : కొన్ని నెలలు జైల్లో పెట్టినా పట్టించుకోను : మనీశ్ సిసోడియా

Maharashtra : మహారాష్ట్రలో రెండు శాసన సభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Updated Date - 2023-02-26T11:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising