Delhi liquor scam case: ఎంపీ సంజయ్ సింగ్ బెయిలు విజ్ఞాపనపై ఈడీకి సుప్రీం నోటీసు
ABN, First Publish Date - 2023-11-20T14:57:12+05:30
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆప్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు సుప్రీంకోర్టు సోమవారంనాడు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తన రిమాండ్, అరెస్టును సవాలు చేస్తూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు (Delhi liquor scam case)లో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆప్ ఆద్మీ పార్టీ (AAP) నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కు సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తన రిమాండ్, అరెస్టును సవాలు చేస్తూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను ఆయన అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. ఈడీ అక్రమంగా తనను అరెస్టు చేసిందని తన పిటిషన్‌లో సంజయ్ సింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 4న సంజయ్‌సింగ్‌ను ఆయన నివాసంలో ఈడీ రోజంతా ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసింది.
కాగా, 2020లో ఆల్కహాల్ దుకాణాలు, వ్యాపారులకు లైసెన్సులు ఇచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో సింగ్, ఆయన సహచరులకు ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. అవినీతి నిరోధక చట్టాలను ఉల్లంఘించడం వల్ల ఖజానాకు భారీ నష్టం వాటిల్లినట్టు చెబుతోంది. ఈనెల మొదట్లో సంజయ్ సింగ్‌ను కోర్టుకు తీసుకువస్తుండగా ఆయన కేంద్రంపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చుట్టూ చాలా పెద్ద కుట్ర జరుగుతోందని, కేవలం అరెస్టుకే పరిమితం చేయకుండా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ప్లాన్ జరుగుతోందన్నారు. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ కోర్టు సంజయ్ సింగ్ జ్యూడిషియల్ కస్టడీని నవంబర్ 24 వరకూ పొడిగించింది.
Updated Date - 2023-11-20T14:57:14+05:30 IST