ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi: ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర పేలుడు జరిగినట్టు ఢిల్లీ పోలీసులకు ఫోన్

ABN, Publish Date - Dec 26 , 2023 | 08:02 PM

దేశరాజధానిలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు జరిగినట్టు ఢిల్లీ పోలీసులకు మంగళవారంనాడు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని ఇజ్రాయెల్ ఎంబసీ (Israel Embassy) సమీపంలో పేలుడు జరిగినట్టు ఢిల్లీ పోలీసులకు (Delhi police) మంగళవారంనాడు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.


ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలోని ప్రజలకు పెద్ద శబ్దం వినిపించినట్టు తెలుస్తోంది. దీనిపై తమకు సమాచారం వచ్చినట్టు అగ్నిమాపక సిబ్బంది ధ్రువీకరించింది. సాయంత్ర 5.10 గంటలకు తమకు అందిన సమాచారంతో ఘటనా స్థలికి వెళ్లామని, ఆ ప్రాంతంలో అలాంటి వస్తువులేవీ కనిపించలేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డెరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ దాడి చేయడం, 1200 మందికి పౌరులు ప్రాణాలు కోల్పోవడం, దీంతో హవాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజా ఘటన ఒకింత కలకలం సృష్టించింది. 2021లోనూ ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ బయట స్వల్ప తీవ్రతతో బాంబు పేలుడు జరపడం ప్రపంచదేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసుపై ఇప్పటికీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ జరుపుతోంది.

Updated Date - Dec 26 , 2023 | 08:07 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising