ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: ఆవు పేడను కూడా వదలడం లేదు... అవినీతిపై మోదీ కన్నెర్ర..!

ABN, First Publish Date - 2023-09-30T17:52:38+05:30

భూపేష్ బఘెల్ సారథ్యంలోని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి నిలయంగా మారిందని, కనీసం ఆవుపేడను కూడా వదలడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో శనివారంనాడు నిర్వహించిన 'పరివర్తన్ మహా సంకల్ప్' ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.

రాయపూర్: భూపేష్ బఘెల్ సారథ్యంలోని ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి నిలయంగా మారిందని, కనీసం ఆవుపేడను కూడా వదలడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో శనివారంనాడు నిర్వహించిన 'పరివర్తన్ మహా సంకల్ప్' ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, రాష్ట్రానికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు.


''ప్రజల కలలను సాకారం చేయడమే నా లక్ష్యం. ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది సాకారమవుతుంది. రాష్ట్రాభివృద్ధికి ఢిల్లీ నుంచి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేస్తోంది. గత ఐదేళ్లలో రోడ్లు, రైల్, విద్యుత్, ఇతర అభివృద్ధి పథకాలం కోసం ఛత్తీస్‌గఢ్‌కు వేల కోట్లు ఇచ్చాం. రాష్ట్రాభివృద్ధి కోసం మా వద్ద నిధుల కొరత లేదు'' అని మోదీ చెప్పారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో పేరుకుపోయిందని, లిక్కర్‌లో అవినీతి, ఆవు పేడలో అవినీతి, చివరకు పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇచ్చిన రేషన్‌ వ్యవహారంలోనూ అవినీతికి పాల్పడుతోందని మోదీ ఆరోపించారు. అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందంటూ ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ చేసిన ఆరోపణలను ప్రధాని తోసిపుచ్చారు. ఛత్తీస్‌గడ్‌లో ఇన్‌ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టుల కోసం వేల కోట్లకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, అయితే ఛత్తీస్‌గఢ్ సర్కార్ వాటికి మోకాలు అడ్డటం, జాప్యం చేయడం చేస్తోందని విమర్శించారు. ప్రజలకు ఢిల్లీ నుంచి తాము ఎంత చేయాలనుకున్నా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరనీయడం లేదని అన్నారు. అయితే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ప్రజలు మార్పు కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ ఆగడాలు ఇంకెంతమాత్రం సహించేది లేదనే నిర్ణయానికి వచ్చారని మోదీ అన్నారు.


రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాంతో సహా ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. 2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార బీజేపీని కాంగ్రెస్ ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Updated Date - 2023-09-30T17:56:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising