ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DK Shivakumar or Siddaramaiah: ‘డీకేనే సీఎం’ అని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అవ్వకపోవడానికి కారణాలివేనా..?

ABN, First Publish Date - 2023-05-15T15:50:47+05:30

బెంగళూరు: ఏడాదిగా అవిశ్రాంతంగా పార్టీ కార్యక్రమాలకు నిర్వహిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్‌ బలంగా ఉంది. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం కూడా అంగీకరిస్తున్నప్పటికీ, ఐదేళ్ల పాలనలో ఎలాంటి ఒడిదుడుకులకు తావీయరాదనే నిశ్చితాభిప్రాయంతో ఉందని అంటున్నారు. ఆ దిశగా డీకే శివకుమార్‌‌కు సీఎం పగ్గాలు అప్పగించడం కంటే సిద్ధరామయ్యకు తొలుత అధికారం అప్పగించి, ఆ తర్వాత క్రమంలో డీకేకు ఛాన్స్ ఇవ్వడం మంచిదనే ఆలోచనతో ఉందని చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఓవైపు ఉత్కంఠ నడుస్తుండగా, సీఎం రేసులో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) కంటే మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ముందున్నారని, అధిష్ఠానం మొగ్గు కూడా ఆయన వైపే ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్‌కు పూర్తి జవసత్తాలు కల్పించి, ఏడాదిగా అవిశ్రాంతంగా పార్టీ కార్యక్రమాలకు నిర్వహిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్‌ కూడా బలంగానే ఉంది. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం కూడా అంగీకరిస్తున్నప్పటికీ, ఐదేళ్ల పాలనలో ఎలాంటి ఒడిదుడుకులకు తావీయరాదనే నిశ్చితాభిప్రాయంతో ఉందని అంటున్నారు. ఆ దిశగా డీకే శివకుమార్‌‌కు సీఎం పగ్గాలు అప్పగించడం కంటే సిద్ధరామయ్యకు తొలుత అధికారం అప్పగించి, ఆ తర్వాత క్రమంలో డీకేకు ఛాన్స్ ఇవ్వడం మంచిదనే ఆలోచనతో ఉందని చెబుతున్నారు.

డీకేపై కేసులే అవరోధమా?

డీకే శివకుమార్ తనకున్న ఇమేజ్‌ను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పదిలం చేసుకున్నారు. పార్టీకి గణనీయంగా సీట్లు, ఓట్లు రాబట్టారు. సీఎం కావడానికి ఇవి ప్రధాన అర్హతలే అయినా, ఆయనపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఒక అడ్డంకి కావచ్చు. ఇందుకు సంబంధించిన సీబీఐ విచారణను ఇటీవల హైకోర్టు వాయిదా వేసింది. మే చివరి వరకూ ఆ గడువును హైకోర్టులోని ప్రత్యేక బెంచ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ డీకే ఊపిరిపీల్చుకుని ఆయన పని చేసుకోవడానికి అవకాశం చిక్కింది. ఈనెల 13న వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘనివిజయం సాధించడంతో పాటు కనకపుర నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో డీకే గెలిచి తనకు తిరుగులేదని అనిపించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు సీఎం పదవి అప్పగిస్తే, ఇప్పటికే అధికారం కోల్పోయిన బీజేపీకి మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని, ఆయనపై ఉన్న కేసులపై విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపే అవకాశం ఉందని, ఆరకంగా కాంగ్రెస్‌ పాలన ముందుకు సాగకుండా చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అధిష్ఠానంలో భయాలు ఉన్నట్టు చెబుతున్నారు. దీనికి తోడు కర్మాటక డీజీపీ ప్రవీణ్ సూద్‌ను సీబీఐ డైరెక్టర్‌గా కేంద్రం తాజాగా నియమించడం కూడా కాంగ్రెస్ భయాలకు మరో కారణంగా చెబుతున్నారు. రెండేళ్ల పాటు సీబీఐ డైరక్టర్‌గా ప్రవీణ్ సూద్ అధికారంలో ఉంటారు.

డీకేకు, ప్రవీణ్‌కు లడాయి?

సీబీఐ చీఫ్‌గా సుబోధ్ జైశ్వాల్ స్థానంలో ప్రవీణ్ సూద్‌ను కేంద్రం కొత్తగా నియమించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సీజేఐ డీవై చంద్రచూడ్, కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరితో కూడిన అత్యున్నత కమిటీ సమావేశమై ప్రవీణ్ కుమార్ ఫైనలేజ్ చేసింది. అయితే, ఆయన అభ్యర్థిత్వంపై అధీర్ రంజన్ చౌదరి కొన్ని అభ్యంతరాలు సైతం లెవనెత్తారు. కర్ణాటకలో బీజేపీకి మద్దతుగా నిలిచారనే ఆరోపణలు ప్రవీణ్ సూద్‌పై ఉన్నాయి.

కాగా, డీకే శివకుమార్‌కు నేరుగా ప్రవీణ్ సూద్‌పై ఎలాంటి గొడవ లేకపోయినప్పటికీ ఆయనకు సైతం అధీర్ రంజన్‌కు ఉన్న అనుమానాలే ప్రవీణ్ సూద్‌పై ఉన్నాయి.

ప్రవీణ్‌ 2020 జనవరిలో కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ సర్కారుకు వత్తాసు పలుకుతూ, తమ పార్టీ వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారంటూ ఎన్నికల సమయంలో డీకే శివకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని తెలిపారు. తాము గెలిస్తే డీజీపీపై చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రవీణ్ సూద్‌ను డీజీపీ పదవి నుంచి తప్పించవచ్చని అనుకుంటున్న తరుణంలో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. సీనియారిటీ పేరుతో ప్రవీణ్ సూద్‌ను కేంద్రం నేరుగా సీబీఐ డైరెక్టర్ పదవి కట్టబెట్టింది. దీంతో డీకేపై ఉన్న కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పసిగట్టిందని చెబుతున్నారు. సిద్ధరామయ్యకు మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వడం, డీకేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా సముచిత గుర్తింపు ఇచ్చి, కొద్దికాలం తర్వాత సిద్ధరామయ్య స్థానంలో ఆయనకు సీఎం పగ్గాలు అప్పగిస్తామని వాగ్దానం చేయడం ప్రస్తుత పరిస్థితిలో ఉత్తమమని భావిస్తోందని చెబుతున్నారు.

రాహుల్ మొగ్గు సిద్ధూపైనే...

ఖర్గేతో సహా, సోనియాగాంధీ, రాహుల్ సైతం సిద్ధరామయ్యకు మరోసారి సీఎం పగ్గాలు అప్పగించడమే మంచిదనే నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. ప్రియాంక గాంధీ మాత్రం డీకేకు సీఎం పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ సీఎల్‌పీ సైతం ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారం అధిష్ఠానానికి అప్పగించడంతో మరి కొద్ది గంటల్లో సీఎం ఎవరనే సస్పెన్స్ వీడిపోనుంది.

Updated Date - 2023-05-15T17:22:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising