ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dy CM: మీకేం డౌట్ లేదు.. మా పార్టీలో అంతా బాగానే ఉందిగా..

ABN, First Publish Date - 2023-11-09T13:12:01+05:30

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొరత లేదని అంతా సజావుగానే సాగుతోందని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

- అనవసర గందరగోళం సృష్టిస్తున్న బీజేపీ

- ఢిల్లీలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొరత లేదని అంతా సజావుగానే సాగుతోందని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) స్పష్టం చేశారు. అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి చేరుకున్న ఆయన బుధవారం కర్ణాటక భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు త్వరలో జంప్‌ కానున్నట్టు బీజేపీ(BJP) నేత మురుగేశ్‌ నిరాణి చేసిన వ్యాఖ్యలను పచ్చి అబద్ధంగా కొట్టిపారేశారు. ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరబోరని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ నాయకత్వంలో ఆపరేషన్‌ కమలకు సంబంధించి బీజేపీ సన్నాహాలు చేస్తోందన్న కథనాలను మీడియా ప్రతినిధులు డీకే శివకుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలోకి వస్తారేమోగానీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అటువైపు వెళ్లబోరని తెలిపారు. తాము ఎవరినీ ప్రలోభ పరచడం లేదని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించి చేరేందుకు ముందుకు వస్తున్నవారిని మాత్రమే తాము చేర్చుకుంటున్నామని వివరించారు. శాసనసభకు ఎన్నికలు జరిగి ఆరు నెలలు కావస్తున్నా ప్రతిపక్షనేతలను ఎన్నుకోలేని దుస్థితిలో ఉన్న బీజేపీ ప్రజలను దారితప్పించేందుకు రకరకాల వదంతులను తెరపైకి తెస్తోందని, వీటిని ఎవరూ విశ్వసించడం లేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో సంభవించిన ఘోర పరాజయాల షాక్‌ నుంచి బీజేపీ నేతలు ఇంకా కోలుకోలేదన్నారు. ఇంకా తాము అధికారంలో ఉన్నట్టు భ్రమ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈనెల 15లోగా వివిధ బోర్డులు, కార్పొరేషన్‌ అధ్యక్ష పదవుల నియామక ప్రక్రియ పూర్తి కానుందన్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను అధిష్టానంతో చర్చించి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కరువుపీడిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారని, నివేదికలు వచ్చిన తక్షణం సహాయక కార్యక్రమాలు మరింత ముమ్మరం చేస్తామన్నారు.

రాజధాని తాగునీటికి 24 టీఎంసీలు రిజర్వు

రాజధాని బెంగళూరు(Bengaluru) నగరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రాబోదని, ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని శివకుమార్‌ ప్రకటించారు. కావేరి బేసిన్‌లోని 24 టీఎంసీల నీటి అవసరాల కోసం వినియోగించుకునేలా జలమండలికి స్పష్టమైన సూచనలు చేశామన్నారు. 2018లో సుప్రీంకోర్టు బెంగళూరులో తాగునీటి అవసరాలకోసం 24 టీఎంసీల నీటిని కేటాయించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ సహా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ తాగునీటిని అందించేందుకు గతంలో కంటే అదనంగా 6టీఎంసీల నీటిని సుప్రీంకోర్టు కేటాయించిందన్నారు. కావేరి జలాల నిర్వహణా ప్రాధికార 89వ సభలో రాష్ట్ర అధ్యక్షులు మేకెదాటు ఆనకట్ట అంశాన్ని బలంగా ప్రతిపాదించారన్నారు. ఈ అంశంపై వచ్చే సమావేశంలో చర్చ జరుపుతామని ప్రాధికార అధికారులు తమకు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. మేకెదాటు ప్రాజెక్టు అనుమతి కోసం అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Updated Date - 2023-11-09T13:12:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising