EC Show Cause: మోదీపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు.. సీఎంకు ఈసీ నోటీసు
ABN, First Publish Date - 2023-11-14T20:57:30+05:30
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు చేశారనే కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు చేశారనే కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్నికల కమిషన్ (Election commission) మంగళవారంనాడు షోకాజ్ నోటీసు (Show cause notice) జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద ఇచ్చిన ఈ నోటీసుకు ఈనెల 16వ తేదీలోగా స్పందించాలని సీఎంకు గడువు విధించింది.
ఎన్నికల నిబంధనావళి, ప్యానల్ చట్టాలతో సహా ఎన్నిక ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా పోస్ట్ ఉన్నందున మీ మీద ఎందుకు చర్య తీసుకోరాదో నవంబర్ 16లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో ఈసీ కోరింది. ప్రధానమంత్రి మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా 'ఆప్' అనైతిక వీడియో క్లిప్, వ్యాఖ్యలు చేసిందని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఈసీకి నవంబర్ 10న బీజేపీ ఫిర్యాదు చేసింది.
పారిశ్రామికవేత్త అదానీ, ప్రధాని మోదీతో ఒక వీడియో స్టోరీని 'ఆప్' ఇటీవల పోస్ట్ చేసింది. ఆ మరుసటి రోజు అదానీ, మోదీ ఫోటోను పోస్ట్ చేస్తూ, పారిశ్రామికవేత్త (అదానీ) కోసం ప్రధానమంత్రి పనిచేస్తున్నారే కానీ ప్రజల కోసం కాదంటూ ఆరోపించింది.
Updated Date - 2023-11-14T20:57:32+05:30 IST