కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Electricity charges: వామ్మో... పెంచేశారుగా.. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు

ABN, First Publish Date - 2023-10-03T11:27:08+05:30

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో విద్యుత్‌ చార్జీలు పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.విద్యుత్‌

Electricity charges: వామ్మో... పెంచేశారుగా.. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో విద్యుత్‌ చార్జీలు పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.విద్యుత్‌ కొను గోలు ధరలు పెరిగిన కారణంగా ఆర్థిక భారాన్ని నియంత్రించే దిశగా చార్జీలను పెంచాల్సిన అవసరం తలెత్తిందని విద్యుత్‌ బోర్డు అధికారులు తెలిపారు. 2023-24వ ఆర్థిక సంవత్సరంలో ఇళ్లకు 100యూనిట్ల వరకు యూనిట్‌కు 25 పైసలు, 101నుంచి200 యూనిట్ల వరకు యూనిట్‌కు 36 పైసలు, 201 యూనిట్‌ నుంచి 300 వరకు 40 పైసలు, 300 యూనిట్లు దాటితే యూనిట్‌కు 40 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా, వ్యాపార సంబంధిత విద్యుత్‌చార్జీ 100యూనిట్ల వరకు యూనిట్‌కు 66 పైసలు, కర్మాగారాలకు యూనిట్‌కు 70 పైసలు, కుటీర పరిశ్రమలకు 100 యూనిట్ల వరకు యూనిట్‌కు 25 పైసల చొప్పున పెంచారు. పెంచిన చార్జీలు అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో వసూలు చేయనున్నట్లు విద్యుత్‌ బోర్డు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-10-03T11:28:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising