ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Elon Musk : బాల్యంలో డబ్బు కోసం అష్టకష్టాలు : ఎలన్ మస్క్

ABN, First Publish Date - 2023-05-07T21:17:22+05:30

టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ (Tech billionaire Elon Musk) ఆర్థికంగా తాను అనుభవిస్తున్న కష్టాల గురించి ట్విటర్ వేదికగా వివరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ (Tech billionaire Elon Musk) ఆర్థికంగా తాను అనుభవిస్తున్న కష్టాల గురించి ట్విటర్ వేదికగా వివరించారు. విద్యార్థి దశలో, బాల్యంలో ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారని ఓ ట్విటరాటీ ప్రస్తావించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తన బాల్యంలో ఆర్థికంగా ఒడుదొడుకులను ఎదుర్కొన్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఎలన్ మస్క్ యాజమాన్యంలో ట్విటర్, టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్, బోరింగ్ కంపెనీ వంటి అనేక కంపెనీలు ఉన్నాయి. తాజాగా ఆయన ఇచ్చిన ట్వీట్‌లో, తాను చాలా దిగువ స్థాయిలో పెరిగానని, ఆదాయం మధ్యస్థంగా ఉండేదని చెప్పారు. తన బాల్యం సంతోషంగా గడవలేదన్నారు. తనకు ఎవరి నుంచి వారసత్వ ఆస్తి లభించలేదని తెలిపారు. ధన రూపంలో తనకు పెద్ద మొత్తంలో ఎవరూ బహుమతి ఇవ్వలేదన్నారు. తన తండ్రి ఓ చిన్న ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ కంపెనీని ఏర్పాటు చేశారని, అది దాదాపు 20 నుంచి 30 ఏళ్లపాటు విజయవంతంగా నడిచిందని చెప్పారు. అయితే ఆయన కష్టాల్లో కూరుకుపోయారని, దివాలా తీశారని, తాను, తన సోదరుడు ఆర్థిక సాయం చేయవలసి వచ్చిందని చెప్పారు.

జాంబియాలో తన తండ్రికి ఓ ఎమరాల్డ్ గని ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ, ఈ గని అక్కడ ఉన్నట్లు తెలిపే సాక్ష్యాధారాలేవీ లేవని మస్క్ చెప్పారు. జాంబియాలో ఓ గనిలో తనకు వాటా ఉందని తన తండ్రి తనకు చెప్పారన్నారు. కొంత కాలం ఆ విషయాన్ని తాను నమ్మినట్లు తెలిపారు. ఆ గనిని ఎవరూ ఎన్నడూ చూడలేదన్నారు. ఆ గని ఉన్నట్లు తెలిపే రికార్డులు కూడా ఏమీ లేవన్నారు. ఆ గని ఉండటం వాస్తవమే అయితే, తన తండ్రి తన నుంచి, తన సోదరుడి నుంచి ఆర్థిక సాయాన్ని కోరవలసిన అవసరం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. హైస్కూల్ చదువు తర్వాత తనకు తన తండ్రి ఆర్థికంగా సహాయం చేయలేదని, తనకు ఫిజిక్స్, ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్ గురించి మౌలికాంశాలను ఆయన బోధించారని, అందుకే రుణం పొందడానికి ఆయన అర్హుడయ్యారని చెప్పారు. ఆయన చెడు ప్రవర్తన కలిగినవారు కాదన్నారు. చిన్న పిల్లలు ఉండటంతో వారి సంక్షేమం కోసం ఆర్థిక సాయాన్ని కొనసాగించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Wrestlers Protest : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ రాజీనామా చేయాలి.. రెజ్లర్లకు రైతు నేతల మద్దతు..

Shashi Tharoor: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన: శశిథరూర్ డిమాండ్

Updated Date - 2023-05-07T21:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising