ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

President Medal awards: రాష్ట్రపతి మెడల్‌ అవార్డులకు పేర్లు సిఫారసు.. రాష్ట్రాలను కోరిన హోం శాఖ

ABN, First Publish Date - 2023-11-27T16:23:29+05:30

రిపబ్లిక్ డే-2024 సందర్భంగా అందించే రాష్ట్రపతి మెడల్‌ అవార్డులకు త్వరితగతిన పేర్లు సిఫారసు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను మరోసారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఈనెల 24న రెండో లేఖ రాసింది. ఏటా ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ కింద రాష్ట్రపతి మెడల్స్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదానం చేస్తుంటారు.

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే-2024 సందర్భంగా అందించే రాష్ట్రపతి మెడల్‌ అవార్డులకు (President Medal awards) త్వరితగతిన పేర్లు సిఫారసు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను మరోసారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) కోరింది. ఈ మేరకు ఈనెల 24న రెండో లేఖ రాసింది. ఏటా ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ (PSM), మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (MSM) కింద రాష్ట్రపతి మెడల్స్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదానం చేస్తుంటారు.


కాగా, నవంబర్ 30వ తేదీ వరకూ గడువు పొడిగించినందున పీఎస్ఎం, ఎంఎస్ఎం అవార్డులకు పేర్లు సిఫారసు చేయాలని తాజా లేఖలో హోం మంత్రిత్వ శాఖ కోరింది. వివిధ రాష్ట్రాలు, యూటీలు, సీఆర్‌పీఎఫ్, సీపీఓలు, సంస్థల నుంచి నామినేషన్లు ఇంతవరకూ తమకు చేరలేదని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలకు రాసిన లేఖలో ఎంహెచ్ఏ పేర్కొంది. ఇదే తరహా లేఖలను ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇతర సెంట్రల్ ఏజెన్సీలు, శాఖల డైరెక్టర్లు, రాజ్యసభ, లోక్‌సభకు ఎంహెచ్ఏ పంపింది. ఫైర్ సర్వీస్ అధిపతులు, సివిల్ డిఫెన్స్ డైరెక్టర్లు, ప్రిజన్ ఇన్‌చార్జిలు, రాష్ట్రాలు, యూటీల హోంగార్డ్ కమాండెంట్ జనరల్, ఎంహెచ్‌ఏలోని అన్ని డివిజన్లకు కూడా ఈ లేఖ పంపింది.


దీనికి ముందు, నవంబర్ 17న ఎంహెచ్ఏ ఒక లేఖ రాసింది. పీఎస్ఎం, ఎంఎస్ఎస్‌ అవార్డులకు పేర్లు సిఫారసు తేదీని నవంబర్ 30 వరకూ పొడిగించినట్టు అందులో తెలిపింది. వివిధ కారణాల రీత్యా గడువును పొడిగించాలని రాష్ట్రాలు, యూటీలు, సీఏపీఎఫ్, సీపీఓలు, సంబంధింత సంస్థలు కేంద్రాన్ని కోరడంతో గడువును కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్న ప్రకారం పేర్ల సిఫారసు గడువు తేదీ నవంబర్ 17వ తేదీతో ముగియాల్సి ఉంది.

Updated Date - 2023-11-27T16:23:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising