Home » Medals
పారిస్ ఒలింపిక్స్‌లో క్రీడల కంటే ఇతర విషయాలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. క్రీడాకారుల కోసం రూపొందించిన ఒలింపిక్ గ్రామంలో సదుపాయాలు సరిగ్గా లేవంటూ ఇప్పటికే చాలా మంది అథ్లెట్లు తమ అసంతృప్తిని వెల్లడించారు. తాజాగా మరో అథ్లెట్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు.
రిపబ్లిక్ డే-2024 సందర్భంగా అందించే రాష్ట్రపతి మెడల్ అవార్డులకు త్వరితగతిన పేర్లు సిఫారసు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను మరోసారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఈనెల 24న రెండో లేఖ రాసింది. ఏటా ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ కింద రాష్ట్రపతి మెడల్స్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదానం చేస్తుంటారు.
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 954 మంది పోలీసులకు పోలీస్ సేవా పతకాలను ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించింది.
గంగా జలాల్లో మెడల్స్ నిమజ్జనం చేస్తామంటూ భారతదేశ టాప్ రెజ్లర్లు హరిద్వార్ చేరుకోవడంతో నెలకొన్న హైడ్రామా మరో మలుపు తిరిగింది. మెడల్స్ గంగలో పారేయవద్దంటూ రైతు నేత నరేష్ టికాయిత్ చేసిన విజ్ఞప్తితో రెజర్లు తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. రెజర్ల నుంచి మెడల్స్ తీసుకున్న టికాయిత్, సమస్య పరిష్కరించడానికి తనకు 5 రోజులు గడువు ఇవ్వాలని వారిని కోరారు.