ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramcharitmanas Row : సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-17T19:38:23+05:30

రామచరిత్‌మానస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యను ఈ నేతలిద్దరూ విమర్శించిన సంగతి తెలిసిందే.

Akhilesh Yadav, Roli Tiwari Mishra
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రోలీ తివారీ మిశ్రా (Roli Tiwari Mishra) ఆ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సనాతన ధర్మాన్ని, రామచరిత్ మానస్‌ను గౌరవించమని కోరినందుకే తనను పార్టీ నుంచి బహిష్కరించారని ఆరోపించారు. మిశ్రాతోపాటు రిచా సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాజ్‌వాదీ పార్టీ గురువారం ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది.

రామచరిత్‌మానస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యను ఈ నేతలిద్దరూ విమర్శించిన సంగతి తెలిసిందే. రోలీ తివారీ ఓ టీవీ చానల్‌తో శుక్రవారం మాట్లాడుతూ, తనను పార్టీ నుంచి బహిష్కరించడానికి కారణమేమిటో తనకు తెలియజేయలేదన్నారు. ‘రోలీ మిశ్రాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం’ అని ఒకే ఒక వాక్యంతో తనను తొలగించారన్నారు. ఇది కాకుండా తనను బహిష్కరించడానికి కారణాలేమిటో తెలిపే నోటీసును తనకు ఇవ్వలేదన్నారు. పార్టీ అధ్యక్షుడి సంతకంతో కానీ, మరో విధంగా కానీ ఎటువంటి నోటీసును తనకు ఇవ్వలేదన్నారు. సనాతన బ్రాహ్మణురాలైన రోలీ తివారీ ఇతర మతాలు, కులాల గురించి మాట్లాడినంత సేపూ సమాజ్‌వాదీ పార్టీ ఆమెను ఇష్టపడుతుందని, అదే రోలీ తివారీ రామచరిత్‌మానస్ గురించి మాట్లాడితే, అది బీజేపీ, ఆరెస్సెస్ ఎజెండా అని ఆ పార్టీ ఆలోచించడం ప్రారంభిస్తుందని అన్నారు. తాను రామచరిత్‌మానస్‌ను గౌరవిస్తున్నందుకే తనను పార్టీ నుంచి బహిష్కరించారన్నారు.

12 గంటలపాటు ఆలోచించిన తర్వాత గట్టి నిర్ణయం తీసుకున్నానన్నారు. శ్రీరాముడి కోసం, రామచరిత్‌మానస్‌ గౌరవం కోసం తాను పోరాటాన్ని కొనసాగిస్తానని వారికి చెప్పానన్నారు. దేశానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పని చేసేవారిపై పోరాడతానని చెప్పారు. శ్రీరాముడే ప్రపంచంలో అతి పెద్ద సమాజ్‌వాదీ అని తాను పరిగణిస్తానని తెలిపారు.

సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య రామచరిత్‌మానస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Karnataka : టిప్పు సుల్తాన్‌పై వ్యతిరేకత... బీజేపీలో భిన్నాభిప్రాయాలు...

George Soros : అత్యంత అరుదైన సంఘటన... బీజేపీతో ఏకీభవించిన కాంగ్రెస్...

Updated Date - 2023-02-17T19:38:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising